TTD BEGINS DIVYA DARSHAN TOKENS _ తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ పునః ప్రారంభం

TIRUMALA, 01 APRIL 2023: TTD resumed issuing Divya Darshan tokens from Saturday onwards at Alipiri and Srivarimettu footpath routes on a trial basis.

 

At Alipiri footpath route, per day 10,000 tokens will be issued at Galigopuram and in the Srivarimettu footpath route, every day 5000 tokens willl be issued at the 1250th step.

 

The tokes will be issued to the devotees in person based on their Adhaar ID proof only.

 

It may be mentioned here that TTD stopped Divya Darshan tokens almost three years ago due to Covid Pandemic. Upon the request from devotees, TTD has resumed Divya Darshan tokens on an experimental basis.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ పునః ప్రారంభం

– . ప్రయోగాత్మకంగా పరిశీలించనున్న టీటీడీ

తిరుమల, 2023 ఏప్రిల్ 01: తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ శనివారం ఉదయం నుండి పునః ప్రారంభించింది.

కోవిడ్ నేపథ్యంలో గత మూడు సంవత్సరాలుగా టీటీడీ దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 1250వ మెట్టు చేంత 5 వేల దివ్యదర్శనం టోకెన్లను ఏప్రిల్ 1వ తేదీ నుండి కేటాయిస్తున్నారు.

భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తారు. టీటీడీ కొద్దిరోజులపాటు ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లు పొందాలని కోరడమైనది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.