SRIVARI SALAKATLA BRAHMOTAVAMS IN EKANTAM-TTD CHAIRMAN _ శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు ఏకాంతం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

FIRST EVER LIVE TELECAST OF BOARD MEETING

Tirumala, 28 Aug, 2020: The TTD Trust Board meeting chaired by Sri YV Subba Reddy was held at Annamaiah Bhavan in Tirumala on Friday, discussed on various important issues including the conduct of twin brahmotsavams which are set in the months of September and October respectively.

 The proceedings of the Board meeting was telecasted live on SVBC for the first time in the history of TTD to have transparency about the decisions taken in the interests of the pilgrims.

 Excerpts from the meeting:

In view of Covid restrictions, it has been decided to conduct the first annual Brahmotsavams which is scheduled from September 19 till 27 will be observed in Ekantham in Srivari temple premises itself in Tirumala. Based on the existing situation during October, an appropriate decision will be taken to conduct Navarathri Brahmotsavams.

 Srivari temples across the country to spread the glory of Lord Venkateswara. TTD will commence the construction of Srivari at Mumbai, Varanasi, Jammu, Chennai once the Covid situation turns to normalcy. The Chairman also said, the board also discussed on how the temple building activity shall be taken up in the respective places by raising funds locally involving philanthropists and enterpreneurs.

Maha Kumbhabhisekham event soon will be performed after relaxation of COVID-19 restrictions at Visakhapatnam and Bhubaneshwar. Board has given nod to a sum of ₹4.95 crore towards building a ghat road for the Vizag temple.

Plans afoot to enhance revenue on Gold and cash deposits in TTD. Efforts underway to get monthly interests credit on all deposits.

 Employees are eligible for treatment under the Employees Health Scheme which will be covered under YSR Arogyasree scheme. Complimenting the employees who have been rendering impeccable services to pilgrims even during Covid pandemic situation, the Chairman said, instructions have already been given to TTD officials to provide quality treatment to the Covid affected employees as per the modalities presecribed by the State Government.

 As TTD has cancelled all arjitha sevas, the devotees who booked the Udayasthamana seva will be provided VIP break darshan till the situation turns normalcy.

 The compost fertilisers generated from the accumulated wet waste will be given to farmers on cost to cost basis. New technology for the solid waste managment in Tirumala soon and TTD Board member Smt Sudha Narayana Murthy has come forward to donate Rs. One Crore to take up the much needed process.

 As suggested by Board Member Sri Siva Kumar, the board has also discussed on the protection of cow (Gomata) and modalities will be decided soon on how to donate one cow to each temple. The board also decided to send its recommendation for containing Cow slaughter as Cow is revered as Gomata in Hindu Dharma.

 The issuance of 3000 free darshan tokens will be resumed at Bhudevi Complex in Tirupati from August 29. The tokens for darshan on August 30 will be issued in this Centre on Saturday as other centres at Srinivasam and Vishnunivasam are turnedout into Covid care centres. 

 TTD Ex-officio including TTD EO Sri Anil Kumar Singhal, TUDA Chairman and Ex-officio member Dr C Bhaskar Reddy, Sri K Parthasarathi, Sri Murali Krishna, Sri DP Anantha, Sri Krishnamoorthy, Sri Chippagiri Venkata Prasad, Sri K Shiva Kumar, Dr M Nichita, Smt V Prasanthi, Sri D Damodara Rao,  Special Invitee Sri Govinda Hari, Addl EO Sri AV Dharma Reddy, Tirupati JEO Sri P Basanth Kumar, JEO Medical and Education Smt Bhargavi Smt Bhargavi were present. While other Board Members participated in the emergency board meeting via video conference.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు ఏకాంతం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల, 2020 ఆగ‌స్టు 28: సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను కోవిడ్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించే న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్సవాల‌ను అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎలా నిర్వ‌హించాలో  నిర్ణ‌యిస్తామ‌న్నారు.
         
టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం శుక్ర‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

–   శ్రీ‌‌వారి వైభ‌వాన్ని విశ్వ వ్యాప్తం చేయడంలో భాగంగా కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో స్థానిక భ‌క్తుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, దాత‌ల‌ నుండి విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యించాం.

–    టిటిడి ఆదాయం పెంచుకునే ఆలోచ‌న‌లో భాగంగా ఇక‌మీద‌ట న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌లో ప్ర‌తి నెల కొంత మొత్తానికి గ‌డువు తీరేలా బ్యాంకుల్లో జ‌మ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ‌బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ ఇస్తున్నందు వ‌ల‌న టిటిడి డిపాజిట్ల‌కు ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చేలా ఆర్‌బిఐ, ఇత‌ర బ్యాంకుల‌తో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం.

–  బ‌ర్డ్ ఆసుప‌త్రిలో కీళ్ల మార్పిడి శ‌స్త్ర చికిత్స చేసుకున్న వారి కోసం రూ. 5.4 కోట్లతో బ‌ర్డ్ ‌ప‌రిపాల‌న భ‌వ‌నం 3వ అంత‌స్తులో 50 ప్ర‌త్యేక గ‌దుల నిర్మాణానికి ఆమోదం. పాత బ్లాక్‌లో చిన్న పిల్లల‌ ఆసుప‌త్రిని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించాం. త్వ‌ర‌లో శ్వాశ‌త భ‌వ‌న‌లు నిర్మిస్తాం.

–  విశాఖ దివ్య క్షేత్రం ఘాట్ ర‌హ‌దారికి వాలు గోడ‌ల నిర్మాణానికి రూ.4.95 కోట్లతో ‌ఆమోదం. క‌రోనా ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చాక ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ఈ ఆల‌యానికి మ‌హా కుంబాభిషేకం నిర్వ‌హిస్తాం. భువ‌నేశ్వ‌ర్ ఆల‌యానికి త్వ‌ర‌లో మ‌హా కుంబాభిషేకం నిర్వ‌హించి, ముంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి శంఖుస్థాప‌న చేస్తాం. వార‌ణాశిలో శ్రీవారి ఆల‌య నిర్మాణం కొసం భూమి కేటాయించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ‌నికి లేఖ రాశాము. జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం భూమి కేటాయించింది. ఇక్క‌డ కూడా త్వ‌ర‌లో ప‌నులు  ప్రారంభిస్తాం.  

–  రాష్ట్రంలోని దేవాదాయ‌శాఖ‌, టిటిడి, వివిధ ధార్మిక సంస్థ‌లు నిర్వ‌హిస్తున్న వేద పాఠశాల‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు తెచ్చి, వేద విశ్వ విద్యాల‌యం ఆధ్వ‌ర్యంలో కామ‌న్ సిల‌బ‌స్ త‌యారుచేసి సంహిత (10వ త‌ర‌గ‌తి), మూలము (ఇంట‌ర్ మీడియేట్) ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఒకే స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం.

–   కోవిడ్ స‌మ‌యంలో కూడా ప్రాణ‌ల‌కు తెగించి ప‌‌ని చేస్తున్న టిటిడి ఉద్యోగుల‌కు ఉద్యోగుల ఆరోగ్య ప‌థ‌కం (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌) అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించాం.

–   క‌రోనా బారిన ప‌డిన టిటిడి ఉద్యోగులు ప్రైవెట్‌ఆసుప‌త్రిలో వైద్యం చేయించుకుంటే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం బిల్లులు చెల్లించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాము.

–    కోవిడ్ కార‌ణంగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు ర‌ద్ధు చేయ‌డం వ‌ల‌న ఇప్ప‌టికే ఉద‌యా‌స్త‌మాన సేవ మ‌రియు వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని ప‌థ‌కాల టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు  ప్రొటోకాల్ విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాము.  

–    తిరుమ‌ల‌లో ‌ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కొర‌కు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌ను కొత్త టెక్నాల‌జితో అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించాం. ఇందుకోసం టిటిడి పాల‌క మండ‌లి స‌భ్యురాలు శ్రీ‌మ‌తి సుధా నారాయ‌ణ‌ మూర్తి కోటి రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించారు. బ‌యో డిగ్రేడ‌బుల్ త‌డి చెత్త నుండి వ‌చ్చే సేంద్రియ ఎరువును విక్ర‌యించ‌డానికి లైసెన్స్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించాం. లాభం లేకుండా రైతుల‌కు ఈ ఎరువు అందిస్తాం.

–    టిటిడి గో సంర‌క్షణ‌‌కు విశేష ప్రాదాన్య‌త ఇస్తొంద‌ని, పాల‌క మండ‌లి స‌భ్యులు శ్రీ శివ‌కుమార్ గుడికో గో మాత అందించే ప్ర‌తిపాద‌న చేశార‌ని, దీనిపై స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎలా అమ‌లు చేయాలో ఆలోచించాల‌ని అధికారుల‌ను  అదేశించాము. గోవ‌ధ నిషేధాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని, అన‌ధికార గోవ‌ధ శాల‌లు మూసి వేయాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల‌కు లేఖ రాయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం.

–    శ‌నివారం నుండి తిరుప‌తిలో 3వేల ఉచిత శ్రీ‌వారి ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేస్తాం.

స‌మావేశంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధర్మకర్తల మండలి సభ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి, శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, డా.నిశ్ఛిత‌, శ్రీ శివ‌కుమార్, శ్రీ‌గోవింద‌హ‌రి, శ్రీ దామోద‌ర్‌రావు, శ్రీ వెంక‌ట ప్ర‌సాద్‌కుమార్‌, శ్రీ డి.పి.అనంత‌, శ్రీ కృష్ణ‌మూర్తి వైద్య‌నాధ‌న్‌,  శ్రీ పార్థ‌సార‌ధి, శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీ ర‌మ‌ణ‌మూర్తి రాజు, అదనపు ఈవో  శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోసినాథ్ జెట్టి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.