TTD BOOK STALL GETS FOCUS AT BOOK MAHOTSAVAM_ పుస్తక మహోత్సవంలో ‘టిటిడి పుస్తక విక్రయశాల’కు విశేష ఆదరణ
Tirupati, 9 February 2018: The TTD book stall was a major hit at the ongoing Book Mahotsav conducted under aegis of the Bharatiya Vidya Bhavan, Tiruapti at the grounds of the SV High school here.
The book exhibition from February 3-11 has been a platform for display of 320 categories of books in Telugu, Sanskrit, English, Hindi, Kannada and 80 CDs produced by the TTD.
The TTD stall also showcased and marketed the annual diary, calendars and also the Sri Vilambi Panchagam for the current year. The stall also sold 16 volumes of CDs of Annamayya Pataku Pattabhisekam series of SVBC produced by Sri SV recording project. The Annamayya sankeertans (600) sung by Sri Mangalampalli Balamuralikrishna, Smt Shobaraj, and Sri Garimella Balakrishna Prasad etc. The CDs of Srinamas of Sri Padmavati Ammavaru, Matrusri Tarigonda Vengamaba Shiva Pranayam, Brahmasri Chaganti Koteswar Rao discourses, 18 chapters of Bhagawad Gita.
The book stalls will be open from 12 noon to 9 PM in the night and open on Saturdays and Sundays under the guidance of the AEO of TTD publications and Sales, Sri N Srinivas Rao, Supdt Sri Varaprasad.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
పుస్తక మహోత్సవంలో ‘టిటిడి పుస్తక విక్రయశాల’కు విశేష ఆదరణ
ఫిబ్రవరి 09, తిరుపతి, 2018: భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్రంవారి పుస్తక ప్రదర్శనలో ఏర్పాటుచేసిన టిటిడి పుస్తక విక్రయశాలకు విశేష ఆదరణ లభిస్తోంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల మైదానంలో టిటిడి ప్రచురణల విక్రయ విభాగం ఆధ్వర్యంలో ‘పుస్తక విక్రయశాలను’ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభమైన ఈ పుస్తక మహోత్సవం ఫిబ్రవరి 11వ తేదీ ముగియనుంది. టిటిడి పుస్తక విక్రయశాలలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, సంస్కృత భాషల్లో 320 రకాల పుస్తకాలు, 80 రకాల సిడి/డివిడిలు ఉన్నాయి.
టిటిడి పుస్తక విక్రయశాలలో అపురూపమైన టీకా తాత్పర్య సహిత పోతన భాగవతం (8 పుస్తకాలు) రూ.1260/-, వాల్మీకి రామాయణం (8 పుస్తకాలు) రూ.1900/-, భగవద్గీత, శ్రీ రమేషన్ రచించిన తిరుమల టెంపుల్(ఇంగ్లీషు), శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి రచించిన తిరుపతి శ్రీవేంకటేశ్వర(ఇంగ్లీషు), తిరుపతి యాత్ర, శ్రీవేంకటేశ్వర కైంకర్యాలు, తిరుపతి పరిసర క్షేత్రాలు, కృష్ణయజుర్వేదం, నమ్మాళ్వార్ తిరువాయ్‌మొళి, వేదములు-జాతీయసదస్సు, కవిత్రయ మహాభారతం-జాతీయసదస్సు, సప్తపది, నీతిశతకం, బాలభారతి సిరీస్ పుస్తకాలు ఉన్నాయి.
ఈ పుస్తకాలతో పాటు టిటిడి డైరీలు, క్యాలెండర్లు, శ్రీ విళంబినామ సంవత్సర పంచాంగం అందుబాటులో ఉన్నాయి.
టిటిడి శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పేరిట 16 వాల్యూమ్‌లలో సిడిలు, అన్నమయ్య మధురగానం, అన్నమయ్య 600 సంకీర్తనలు, శ్రీ మంగళంపల్లి బాలమురళీక ష్ణ, శ్రీమతి శోభారాజ్, శ్రీ గరిమెళ్ల బాలక ష్ణప్రసాద్ వంటి ప్రముఖ గాయకులు ఆలపించిన సంకీర్తనలు, శ్రీపద్మావతి అమ్మవారి శ్రీనామాలు, మాత శ్రీ తరిగొండ వెంగమాంబ శివప్రణయం, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ధార్మిక ఉపన్యాసాలు, భగవద్గీత 18 అధ్యాయాల ఉపన్యాసాలు తదితర సిడిలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పుస్తక విక్రయశాల భక్తులకు అందుబాటులో ఉంటుంది. టిటిడి ప్రచురణల విక్రయ విభాగం ఏఈవో శ్రీవి.ఎన్.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ శ్రీ వరప్రసాద్ ఈ పుస్తకవిక్రయశాలను పర్యవేక్షిస్తున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.