TTD CANCELS DIVIYA DARSHAN TOKEN DURING PERATASI SATURDAYS_ భక్తుల రద్దీ కారణంగా పెరటాసి శనివారాల్లో దివ్యదర్శనం టోకెన్ల రద్దు

Tirumala, 21 September 2017: Anticipating heavy pilgrim influx during Peratasi Saturdays and certain other important days, TTD has cancelled Divya Darshan tokens.

The dates includes, four Peratasi Saturdays on 23rd September, 30th September, 7th October and 14th October. While certain other important days where massive pilgrim crowd is expected on Garuda Seva day which falls on September 27, Vaikuntha Ekadasi on December 29 and New Year Day on January 1.

On the other hand, no privilege of darshan and accommodation will be entertained even for donors during the above said dates.

The devotees are requested to make a note of this and co-operate with TTD management.

ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTD, TIRUPATI

భక్తుల రద్దీ కారణంగా పెరటాసి శనివారాల్లో దివ్యదర్శనం టోకెన్ల రద్దు

సెప్టెంబర్‌ 21, తిరుమల, 2017 : పవిత్రమైన పెరటాసి మాసంలో శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని, ఈ కారణంగా దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామని టిటిడి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

సెప్టెంబరు 23న మొదటి పెరటాసి శనివారం, సెప్టెంబరు 30న రెండో పెరటాసి శనివారం, అక్టోబరు 7న మూడో పెరటాసి శనివారం, అక్టోబరు 14న నాలుగో పెరటాసి శనివారం రోజుల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తారు. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో గరుడసేవ కారణంగా సెప్టెంబరు 27న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 29న, నూతన సంవత్సరం సందర్భంగా 2018, జనవరి 1న కాలినడక భక్తులకు టోకెన్ల జారీ ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.