TTD CANCELS MORNING SLOT FOR AGED AND PHC ON WEDNESDAYS_ వృద్ధులు, దివ్యాంగులకు ఇకపై బుధవారం ఉదయం దర్శన స్లాట్ రద్దు మధ్యాహ్నం స్లాట్ టోకెన్లు 700 నుండి 1000కి పెంపు
Tirumala, 23 October 2018: Tirumala Tirupati Devasthanams has dispensed with morning slot darshan for aged and physically challenged category during all Wednesdays, which will come into effect from October 24 on wards.
The management has enhanced the evening time slot [i.e., 3:00 PM slot] tokens from the existing 700 to 1,000 members in respect of the physically challenged / old aged pilgrims permitting for darshan on all Wednesdays. The HOD [IT], TID, Tirupati / Peishka[ Sri TT, Tirumala are requested to take necessary further action
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వృద్ధులు, దివ్యాంగులకు ఇకపై బుధవారం ఉదయం దర్శన స్లాట్ రద్దు మధ్యాహ్నం స్లాట్ టోకెన్లు 700 నుండి 1000కి పెంపు
అక్టోబరు 23, తిరుమల 2018: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే వృద్ధులు, దివ్యాంగులకు ఇకపై ప్రతి బుధవారం ఉదయం 10 గంటల దర్శన స్లాట్‌ను టిటిడి రద్దు చేసింది. కాగా, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో దర్శన టోకెన్ల సంఖ్యను 700 నుండి 1000కి పెంచింది.
65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, శారీరక, మానసిక వైకల్య సమస్యలున్నవారికి టిటిడి అన్ని సౌకర్యాలతో సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఇందుకోసం 7 కౌంటర్లను టిటిడి ఏర్పాటుచేసింది. ఇక్కడ ఉదయం 10 గంటల స్లాట్‌కు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌కు 700 మందికి టోకెన్లు మంజూరు చేస్తున్నారు. శుక్రవారాల్లో మధ్యాహ్నం మాత్రమే 700 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇకపై ప్రతి బుధవారం మధ్యాహ్నం 1000 దర్శన టోకెన్లు మంజూరు చేస్తారు.
వృద్ధులు, దివ్యాంగులకు టిటిడి పలు సౌకర్యాలు కల్పిస్తోంది. టోకెన్లు పొందినవారు రాయితీపై రూ.20/-కి రెండు లడ్డూలు, రూ.70/-కి నాలుగు లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. కౌంటర్ల నుండి 2 బ్యాటరీ వాహనాలు, ఒక వ్యాన్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులను దక్షిణ మాడ వీధి వద్దగల వేచి ఉండే హాళ్లకు తరలిస్తారు. మొత్తం 3 వేచి ఉండే హాళ్లలో వెయ్యి మందికిపైగా కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటుచేశారు. మరుగుదొడ్ల వసతి ఉంది. ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ హాళ్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించేందుకు టివిని ఏర్పాటుచేశారు. సెల్‌ఫోన్లు, లగేజిని ఇక్కడే డిపాజిట్ చేసే సౌకర్యం ఉంది. దర్శనం తరువాత తిరిగి ఇక్కడే వీటిని పొందొచ్చు. వేచి ఉండే హాళ్ల నుండి ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనానికి పంపుతారు. నడవలేనివారికి శ్రీవారి సేవకులను సహాయకులుగా పంపుతారు.
నెలకు రెండు సార్లు 4 వేల మందికి అనుమతి
రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో నెలకు రెండు సార్లు వయోవృద్ధులకు, దివ్యాంగులకు కలిపి 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేస్తోంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
సాధారణ రోజుల్లో ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను నెలలో రెండు సాధారణ రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.