TTD CELEBRATES ADI SHANKARA UTSAVAMS IN SRINIVASA MANGAPURAM AND VONTIMITTA _ శ్రీనివాసమంగాపురం, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఘనంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులవారి మహోత్సవాలు
TIRUPATI, 05 NOVEMBER 2021: As the Honourable Prime Minister of India has opened the renovated Sri Adi Shankaracharya Samadhi at Kedarnath in Uttarakhand on Friday, TTD has observed special utsavams at Srinivasa Mangapuram and Vontimitta temples as they were believed to have been visited by Jagatguru during his Desa Sanchara for establishing Advaita Siddhanta across the country.
TTD JEO Sri Veerabrahmam paid floral tributes to the photo of Jagatguru Sri Adi Shankaracharya set up in a specially arranged stage at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram and later commenced special spiritual programmes after lighting the lamp and performing special pujas.
Later hundreds of people gathered to witness the live telecast of the opening fete of Sri Adi Shankaracharya Samadhi by the Prime Minister at Kedarnath through the giant LED screens arranged at the temple premises both at Srinivasa Mangapuram and also Vontimitta in YSR Kadapa District.
As part of this ceremony, the students SV College of Music and Dance performed dance ballets, Annamacharya Project artists presented sankeetans and Harikatha Parayanam while the scholars on behalf of HDPP delivered religious discourses on the life of Sri Adi Shankaracharya on the occasion.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీనివాసమంగాపురం, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఘనంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులవారి మహోత్సవాలు
తిరుపతి, 2021 నవంబరు 05: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ పుణ్య క్షేత్రంలో పునర్నిర్మించిన శ్రీ ఆది శంకరాచార్యుల వారి సమాధిని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు.
జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులవారు శ్రీనివాసమంగాపురం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నందున ఈ ప్రాంతాల్లో శుక్రవారం టిటిడి మహోత్సవాలను ఘనంగా నిర్వహించింది.
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసమంగాపురం, ఒంటిమిట్ట ఆలయాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎల్ఈడి స్క్రీన్ లలో కేదార్నాథ్ నుండి ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసమంగాపురం, ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజ, ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులతో భరతనాట్యం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ పారాయణం చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ ఆది శంకరాచార్యుల జీవిత చరిత్రపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది