TTD CELEBRATES ITS MAIDEN HANUMAN JAYANTHI FETE AT ANJANADRI _ తిరుమ‌ల ఆకాశ‌గంగ వ‌ద్ద తొలిసారిగా హనుమజ్జయంతి వేడుక‌లు – టిటిడి ఈవో

HENCEFORTH GRAND CELEBRATIONS EVERY YEAR AT HANUMAN BIRTH PLACE IN TIRUMALA-TTD EO

 SPECIAL ABHISHEKAM PERFORMED TO ANJANA DEVI-ANJANEYA SWAMY IN THE NEWLY CONSTRUCTED TEMPLE AT AKASAGANGA

 Tirumala, 4 Jun. 21: After declaring Anjanadri located in the green woods of Tirumala near Akasa Ganga as the original birth place of Sri Anjaneya Swamy, TTD has celebrated its maiden Hanuman Jayanthi fete in this sacred place on Friday.

The TTD EO Dr KS Jawahar Reddy who participated in the special abhishekam being performed to the presiding deities of Anjana Devi and Bala Anjaneya Swamy located in the newly constructed temple at Akasa Ganga, speaking on the occasion said, “This year we will be observing Hanuman Jayanti festivities for days till June 8. Henceforth this festival will be observed with utmost grandeur every year at Anjanadri in Tirumala apart from special abhishekam to Bedi Anjaneya Swamy and Seventh Mile Anjaneya Swamy”, he maintained.

Later National Sanskrit Varsity VC Sri Muralidhara Sharma said, Hanuman Jayanthi will be observed on the auspicious day of Vaisakha Suddha Dasami. According to Skanda Purana, Anjaneya was born to Anjana Devi after her penance which lasted for over thousands of years.

Earlier, Abhishekam and Archana were performed to the divine Mother-Son duo amidst chanting of Vedic mantras by Vedic Pundits following Covid guidelines. Later Sri Anjaneya Swamy was decked with betel leaves and jasmine garlands. For the sake of global devotees, the entire event was telecasted live on SVBC.

Later Smt Jayanthi Savitri team rendered Harikatha Parayanam on the Glory of Hanumantha on the celestial occasion.

Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, SVBC CEO Sri Suresh Kumar and other officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల ఆకాశ‌గంగ వ‌ద్ద తొలిసారిగా హనుమజ్జయంతి వేడుక‌లు – టిటిడి ఈవో

తిరుమల, 2021 జూన్ 04: తిరుమల క్షేత్రంలోని అంజ‌నాద్రి కొండ‌పై ఆంజ‌నేయ‌స్వామివారు జ‌న్మించిన ఆకాశ గంగ తీర్థం వ‌ద్ద హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లను శుక్ర‌వారం తొలిసారిగా టిటిడి ప్రారంభించిన‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్స‌వాల‌ను అకాశ‌గంగ‌, జాపాలి వ‌ద్ద నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.

ఇందులో భాగంగా ఆకాశ‌గంగ వ‌ద్ద అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారికి నిర్మించిన ఆల‌యంలో అభిషేకం, త‌మ‌ల‌పాకుల‌తో పూజ‌, మ‌ల్లె పూల‌తో అర్చ‌న నిర్వ‌హించామ‌న్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహించిన‌ట్లు తెలిపారు.
కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌ధ్యంలో ఇక్క‌డ‌కు రాలేని భ‌క్తులు ఎస్వీబిసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించి స్వామివారి అనుగ్ర‌హ‌నికి పాత్రులు కావాల‌ని కోరారు. ఈ ఉత్స‌వాల‌కు ఏర్పాట్లు చేసిన టిటిడి సిబ్బందిని ఆయ‌న అభినందించారు.

అనంత‌రం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ మాట్లాడుతూ వైశాఖ శుద్ధ ద‌శ‌మినాడు హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు నిర్వ‌హిస్తార‌న్నారు. స్కంధ పురాణంలో తెలిపిన విధంగా మాతంగా మ‌హ‌ర్షి సూచ‌న మేర‌కు అకాశ‌గంగ తీర్థం వ‌ద్ద అంజ‌నాదేవి వేలాది సంవ‌త్స‌రాలు త‌ప‌స్సు చేసి ఆంజ‌నేయ‌స్వామివారికి జ‌న్మ‌నిచ్చిన‌ట్లు చెప్పారు. ఇప్పుడు ఆల‌యం నిర్మించిన ప్ర‌దేశంలోనే అంజ‌నాదేవి త‌ప‌స్సు చేసిన‌ట్లు తెలిపారు. భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మం, సంస్కృతికి మూల‌మైన పురాణాల‌ను అనుస‌రించి ఆంజ‌నేయ‌స్వామివారు ఇక్క‌డ జ‌న్మించార‌ని వివ‌రించారు.

త‌రువాత అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి శ్రీ‌మ‌తి జ‌యంతి సావిత్రి బృందం హ‌నుమంతుని వైభ‌వంపై హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.

ఈ పూజ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు. సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి దంప‌తులు, ఎస్వీబిసి సిఇవో శ్రీ సురేష్ కుమార్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి –

శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వ‌హించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.