TTD CHAIRMAN AND EO CONDOLE DR POTTURI DEMISE _ డా. పొత్తూరి వేంకటేశ్వరరావు మృతికి టిటిడి ఛైర్మన్, ఈవో సంతాపం
Tirupati, 5 March 2020: TTD Chairman Sri YV Subba Reddy and Executive Officer Sri Anil Kumar Singhal on Thursday have condoled the sad demise of eminent editor and literary personality Dr Potturi Venkateswara Rao and prayed for peace to his soul.
Both conveyed their deep and heartfelt condolences to the bereaved family members.
Dr Venkateswara Rao had rendered significant contributions to the publications division of TTD in various capacities during 90s.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
డా. పొత్తూరి వేంకటేశ్వరరావు మృతికి టిటిడి ఛైర్మన్, ఈవో సంతాపం
తిరుపతి, 2020 మార్చి 05 ;సుప్రసిద్ధ పాత్రికేయులు, నిరంతర సాహితీకృషీవలుడు, రచయిత డా. పొత్తూరి వేంకటేశ్వరరావు మృతికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. డా. పొత్తూరి వేంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
డా. పొత్తూరి వేంకటేశ్వరరావు టిటిడి ప్రచురణల విషయంలో ఎనలేని సేవ చేశారు. టిటిడి ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కవిత్రయ విరచిత మహాభారతం సంపాదకమండలి సభ్యులుగా 1992 నుండి 2004 వరకు, మహాభారతం పరిష్కృత ప్రతి పండిత పరిషత్ సభ్యులుగా 2005 నుండి 2013 వరకు సేవలందించారు. 2011 నుండి 2014 వరకు టిటిడి ప్రచురణల సలహా మండలి సభ్యులుగా కొనసాగారు. టిటిడి నూతనంగా ముద్రించాల్సిన అనేక గ్రంథాల విషయమై మార్గనిర్దేశనం చేశారు. టిటిడికి సంబంధించిన పలు ముఖ్యమైన కమిటీల్లో తనదైన సేవలు అందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.