TTD CHAIRMAN AND EO PRESENT HOLY SILKS TO SRI KALAHASTEESWARA _ శ్రీకాళహస్తీశ్వరునికి టిటిడి ఛైర్మన్, ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

Tirupati, 23 Feb. 20: TTD chairman Sri YV Subba Reddy and EO Sri Anil Kumar Singhal today presented Holi, silk vastrams to Sri Bramarambha   sameta Sri Kalahasteeswara at the Kalyanotsavam as part of ongoing annual Brahmotsavams of Sri Kalahasteeswara temple on Sunday evening.

The Chairman and EO couple were given a traditional welcome at the temple gates by Sri P Rajasekhar Reddy, EO of Sri Kalahasteeswara Temple and after darshan they were presented thirtha Prasadams.

The Maha Shivaratri Brahmotsavams of Sri Kalahasti Commenced from February 16 -28. Legends say that TTD has been presenting Patti vastrams since last 20 years as Sri Brahmarambha is hailed as sister of Lord Venkateswara.

OSD of Srivari temple Sri Pala Sheshadri, and Bokkasam Incharge Sri Gururaja Rao and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

శ్రీకాళహస్తీశ్వరునికి టిటిడి ఛైర్మన్, ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

ఫిబ్రవరి 23, తిరుపతి, 2020: శ్రీకాళహస్తిలోని భ్రమరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణోత్సవం సందర్భంగా టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఛైర్మ‌న్ దంప‌తులు, ఈవో దంప‌తుల‌కు శ్రీ‌కాళ‌హ‌స్తి ఆలయ ఈవో శ్రీ సి.చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అర్చకబృందం కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను టిటిడి ఛైర్మ‌న్‌, ఈవోల‌కు అందించారు.

శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 16న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 28వ తేదీ వరకు జరుగనున్నాయి. గత 20 ఏళ్లుగా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీనివాసుడి సోదరి అయిన భ్రమరాంబ సౌభాగ్యం కోసం శ్రీవారు పట్టువస్త్రాలు పంపుతున్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.