TTD CHAIRMAN CONSOLES SANNIDHI YADAVA FAMILY _ సన్నిధి యాదవ కుటుంబానికి టీటీడీ చైర్మన్ పరామర్శ : టీటీడీ అండగా ఉంటుందని భరోసా

Tirumala, 30 May 2021: TTD Chairman Sri YV Subba Reddy called on and consoled the family members of the deceased Sannidhi Yadava Sri Padmanabham on Sunday.

If may be mentioned here that Sri Padmanabham who was discharging duties as Sannidhi Yadava in Tirumala temple succumbed to death on Saturday following Cardiac arrest.

Sri Subba Reddy in his condolence message recalling the services of Sri Padmanabham said that he had the divine opportunity of opening the doors of Sri Venkateswara every day along with first Darshan for decades. He said TTD will extend full support to the family of the deceased Sannidhi Yadava.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సన్నిధి యాదవ కుటుంబానికి టీటీడీ చైర్మన్ పరామర్శ: టీటీడీ అండగా ఉంటుందని భరోసా

తిరుమల 30 మే 2021: గుండె పోటుతో శనివారం రాత్రి కన్ను మూసిన తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధి యాదవ శ్రీ పద్మనాభం యాదవ్ కుటుంబాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదివారం పరామర్శించారు. శ్రీ పద్మనాభం మరణ వార్త తెలుసుకున్న శ్రీ సుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు.

టీటీడీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. శ్రీ పద్మనాభం ఆకస్మిక మరణం పట్ల చైర్మన్ సంతాపం తెలియజేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాదించాలని శ్రీ సుబ్బారెడ్డి కోరారు. స్వర్గీయ పద్మనాభం కుటుంబం కొన్ని దశాబ్దాలుగా స్వామివారి సేవలో ఉందన్నారు. శ్రీవారి ఆలయ తలుపులు మొదట తెరిచి దర్శనం చేసుకునే అదృష్టం స్వామి వారు శ్రీ పద్మనాభం కు ప్రసాదించారని చైర్మన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది