TTD CHAIRMAN DONATES LAKSHMI KASULA NECKLACE TO GODDESS PADMAVATHI _ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ల‌క్ష్మీ కాసుల‌హారం బ‌హూక‌రించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బా‌రెడ్డి దంప‌తులు

Tiruchanoor, 19 Nov. 20: On the occasion of Panchami Theerrtham (chakrasnanam) on the last day of annual Karthika Brahmotsavams of Goddesses Padmavati on Thursday at Tiruchanoor, the TTD Chairman Sri YV Subba Reddy and his spouse Smt Swarnalatha Reddy presented a Lakshmi kasula haram weighing 55.150 gm worth Rs3 lakhs to Goddess Padmavati.

They handed over their offering to TTD EO Dr KS Jawahar Reddy inside Ammavari temple.

The necklace was later decorated to Utsavamurty of Ammavaru during Snapana Tirumanjanam after rendering special pujas by keeping the jewel at the feet of Mula murthy earlier.

TTD JEO Sri P Basant Kumar, Temple DyEO Smt Jhansi Rani and AEO Sri Subramaniam were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ల‌క్ష్మీ కాసుల‌హారం బ‌హూక‌రించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బా‌రెడ్డి దంప‌తులు
 
తిరుప‌తి, 2020 నవంబ‌‌రు 19: శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో చివరి రోజైన గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం)  పుర‌స్క‌రించుకుని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బా‌రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి స్వ‌ర్ణ‌ల‌త రెడ్డి 55.160 గ్రాముల బ‌రువైన రూ.3 ల‌క్ష‌ల‌కు పైగా విలువ చేసే బంగారు ల‌క్ష్మీ  కాసులహారం అమ్మ‌వారికి  బ‌హూక‌రించారు.

అమ్మ‌వారి ఆల‌యంలో ఛైర్మ‌న్ దంప‌తులు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డికి ల‌క్ష్మీ కాసుల హారం అంద‌జేశారు. అర్చ‌కులు ఈ హారాన్ని అమ్మ‌వారి మూల‌మూర్తి వ‌ద్ద ఉంచి పూజ‌లు చేశారు. ‌అనంత‌రం పంచమీ తీర్థం సంద‌ర్భంగా నిర్వ‌హించిన స్న‌ప‌న తిరుమంజ‌నంలో కాసుల హారాన్ని అమ్మ‌వారికి అలంక‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.