TTD CHAIRMAN, EO OFFERS SILK VASTRAMS TO KANIPAKAM VINAYAKA _ కాణిపాకం వినాయకుడికి తితిదే పట్టువస్త్రాల సమర్పణ

KANIPAKAM, SEPT. 17:  TTD Chairman Sri K Bapiraju and TTD EO Sri M G Gopal offered silk vastrams to Lord Varasiddhi Vinayaka of the famous Kanipakam temple as a presentation from Lord Venkateswara on the occasion of the ongoing brahmotsavams at Kanipakam on Tuesday.

presenation of vastram1presentation of vastram presentation of vastram1           The Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri GVG Ashok Kumar were also present during the ceremonious presentation of silk vastrams.

The TTD entourages were earlier given a warm reception by Kanipakam Executive Officer Sri Purnachandra Rao.

After darshan of Lord Varasiddhi Vinayaka, TTD Chairman told media persons that he prayed the presiding deity to shower his blessings on the people of the state to lead a happy and prosperous life.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కాణిపాకం వినాయకుడికి తితిదే పట్టువస్త్రాల సమర్పణ

తిరుమల, సెప్టెంబరు 17, 2013: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఈ నెల 9 నుండి 29వ తేదీ వరకు 21 రోజుల పాటు గణనాధుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తితిదే తరఫున ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్‌ మంగళవారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దర్శనానంతరం తితిదే ఛైర్మన్‌ శ్రీ కనుమూరు బాపిరాజు మాట్లాడుతూ వరాలిచ్చే దేవునిగా ప్రసిద్ధి చెందిన కాణిపాక వినాయక స్వామివారిని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను ప్రార్థించినట్టు తెలిపారు. ముందుగా కాణిపాకం ఆలయ ఈవో శ్రీ పి.పూర్ణచంద్రరావు తితిదే ఛైర్మన్‌, ఈవోలకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌ కుమార్‌, అర్చక బృందం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.