TTD CHAIRMAN INAUGURATES FEED MIXING PLANT AT SV GOSALA _ గోశాలలో రోజుకు 4వేల లీటర్ల పాల ఉత్పత్తి దిశగా కార్యాచరణ

TIRUPATI, 31 MARCH 2023: With an aim to produce healthy bovines, TTD has set up a feed mixing plant in SV Gosala at Tirupati which was inaugurated by TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri AV Dharma Reddy on Friday.

Speaking on the occasion, the Chairman said, this would helps not only producing healthy calves, but also enhancing the quantity of milk produce.

He said, the SV Veterinary University along with America based New Tech Bio Sciences Institution, has come out with three point formula to manufacture hygienic fodder for the cattle and inked a pact on the same.

TTD along with a firm has constructed a Feed Mixing Plant at a cost of Rs.11crores in SV Goshala which is inaugurated and henceforth the fodder will be produced for the cattle. So that this would help in enhancing the milch capacity of bovines by 10-15% and we can generate 4000 litres of milk that is required for the needs of TTD in SV Gosala itself, he added. 

TTD Board Member Sri Pokala Ashok Kumar, JEO for Health and Education Smt Sada Bhargavi, CE Sri Nageswara Rao, SVVU Vice-Chancellor Sri Padmanabha Reddy, SV Gosala Director Dr Harinatha Reddy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గోశాలలో రోజుకు 4వేల లీటర్ల పాల ఉత్పత్తి దిశగా కార్యాచరణ

– భక్తుల డిమాండ్ కు తగిన విధంగా అగర బత్తీల తయారీ

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 31 మార్చి 2023: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాలను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ తయారు చేస్తున్న అగర బత్తీల ఉత్పత్తిని డిమాండ్ కు తగినట్లుగా పెంచే చర్యలు తీసుకుంటామన్నారు.

ఎస్వీ గోశాలలో నిర్మించిన ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసే అగరబత్తుల రెండవ యూనిట్ ను శుక్రవారం టీటీడీ ‌చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ…

– తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు, తిరుమల, తిరుపతిలోని అనుబంధ ఆలయాల నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే స్వఛ్చమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సొంతంగా తయారు చేసుకోవాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది.

– ఇందుకోసం దేశవాళీ గోవుల పెంపకం, దేశవాళీ గో జాతులను అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు తయారుచేసి వాటిని అమలు చేయడం జరిగింది.

– లేగ దూడల పెంపకం, గోవుల పెరుగుదల, వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, నాణ్యమైన పాల ఉత్పత్తికి మనం గోవులకు అందించే మేతకు అవినాభవ సంబంధం ఉంటుంది.

– ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి, దేశవాళీ గోసంతతిని మరింత అభివృద్ధి చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన న్యూటెక్‌ బయోసైన్సెస్‌ సంస్థతో మూడు రకాల ఫార్ములాలతో కల్తీ లేని నాణ్యమైన పశువుల దాణా సొంతంగా తయారు చేసుకోవడానికి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది.

– ఇందుకోసం రూ.11 కోట్లతో టిటిడి సొంతంగా ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ నిర్మించుకుంది.ఇందులో దాత ఒకరు రూ 2కోట్లు విరాళం అందించారు.

– ఈ ప్లాంట్‌లో ఈ రోజు నుండే దాణా ఉత్పత్తి జరుగుతుంది.

– టిటిడి అవసరాలకు రోజుకు అవసరమయ్యే నాలుగు వేల లీటర్ల పాలను గోశాలలోనే ఉత్పత్తి చేయడం కోసం ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ ఎంతో
ఉపయోగపడుతుంది.

– గోవులకు బలవర్ధకమైన సమగ్రదాణా అందించడం ద్వారా పాల ఉత్పత్తి ఇప్పటికంటే 10 నుంచి 15 శాతం పెరుగుతుంది.

– ఇక్కడ తయారుచేసే సమగ్ర దాణాను గోవులకు అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు గోవులు ఇచ్చే పాలలో ప్రొటీన్‌ శాతం మరింత అధికంగా లభిస్తుంది.

– దీనివల్ల టిటిడికి ప్రతి రోజు అవసరమయ్యే 4 వేల లీటర్ల పాల అవసరాన్ని దశలవారీగా చేరుకునే అవకాశం లభిస్తుంది.

– దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడం కోసం దాతల సహకారంతో 500 దేశవాళీ గోవులను సమీకరించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ దేశవాళీ జాతుల గోవులను తీసుకుని వచ్చాము.

జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పద్మనాభరెడ్డి, టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు శ్రీ రామ్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది