TTD CHAIRMAN INAUGURATES SRIVARI MAHA EXIBITION _ శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను ప్రారంభించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirumala, 30 Sep. 19: The theme concept of Sri Atti Varadaraja Swami has been a major hit at the Maha Exhibition organised by the TTD as a part of the annual Brahmotsavams,  said TTD Trust Board members.

He inaugurated the Srivari Maha exhibition at the Kalyana Vedika in which the SV Museum, Public Relation Department, Garden,  Ayurvedic,  Miniature art were showcased. 

Sri Reddy said, the three pose setting of Varadarajaswami of Kanchi with 40 tonnes of flowers including 2 lakh cut flowers was eye-catching. 

The animal, kalasha and Rathas made with flowers and fruits, Vahana sevas, 3D projection mapping, display of TTD publications, herbal medicine, a photo exhibition by the PR department were a major hit.

The Chairman also visited the Ayurveda medical camp organised by the SV Ayurveda hospital near Sri Varahaswami Rest house.

 

TTD Board members Sri K Siva Kumar, Sri M Ramulu, Sri Chippagiri Prasad Kumar, Sri DP Ananta, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramachandra Reddy, Additional CVSO Sri Shiva Kumar Reddy, Museum In-charge Sri M Chandrasekhar, Deputy Director of Garden Sri Srinivasulu, SV Ayurveda hospital official Sri Bhaskar Rao, VGO Sri Manohar and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను ప్రారంభించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

  తిరుమల, 2019 సెప్టెంబర్ 30:  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా  తిరుమల కల్యాణవేదికలో ఏర్పాటు చేసిన శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను సోమవారం ఉదయం టిటిడి అదనపు ఈవో శ్రీఏవీ ధర్మారెడ్డితో కలిసి  టిటిడి ఛైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా మహాప్రదర్శనను ఏర్పాటు చేశారని తెలిపారు. భక్తులను ఆకర్షించేలా కల్యాణవేదికలో టిటిడి ఎస్వీ మ్యూజియం విభాగం, ప్రజాసంబంధాల విభాగం, ఉద్యానవన శాఖ, అటవీవిభాగం, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో మహాప్రదర్శనను రూపొందించారన్నారు. శ్రీ అత్తి వరదరాజస్వామివారి తరహాలో మూడు భంగిమల్లో సెట్టింగ్ ఏర్పాటు చేయడం,  కంచికి వెళ్లి చూసినట్లు ఉందన్నారు. అదేవిధంగా, నాలుగు యుగాలకు సంబంధించిన పౌరాణిక ఘట్టాలతో భక్తిభావాన్ని పంచేలా దేవతామూర్తులను రూపకల్పన చేశారని అన్నారు. బ్రహ్మోత్సవాలలో దాదాపు 40 టన్నుల పుష్పాలు, 2 లక్షల కట్ ఫ్లవర్లను వినియోగించనున్నారని తెలిపారు. ఫలపుష్పాలతో ఏర్పాటు చేసిన ఏనుగులు, కలశాలు, గుర్రాలు, రథం తదితర ఆకృతులను తిలకించారు.  
         

ముందుగా శ్రీమహావిష్ణువు గరుడినిపై వస్తున్న విధంగా రూపొందించిన సైకత శిల్పం, స్వామివారి చిత్రాలు, వాహనసేవలు,   త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, తిలకించారు. ప్రత్యేక పుస్తక ప్రదర్శన, సూక్ష్మ కళా చిత్ర ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జౌషధాల ప్రదర్శన,  టిటిడి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో భక్తులను ఆకర్షించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. నాడు నేడు పేరిట తిరుమల చరిత్రను తెలిపే ఫోటోలు, టిటిడి ఉత్సవాలు, పంచబేరాలు, అలిపిరి నుండి అఖిలాండం వరకు గల విశేషాలు, శ్రీవారి ఆలయంలోని మండపాలు, ఘాట్ రోడ్ల ఫోటోలను పరిశీలించారు.
             

అంతకుముందు శ్రీవరాహస్వామి అతిథి గృహం – 1 పక్కన ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. భక్తులకు అవసరమైన వైద్యసేవలు అందించాలని కోరారు.            
           

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ కె.శివకుమార్, శ్రీ ఎం. రాములు, శ్రీ చిప్పగిరి ప్రసాద్ కుమార్, శ్రీ అనంత్,  సివిఎస్వో శ్రీ గోపినాథ్ శెట్టి, సిఈ శ్రీ రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, మ్యూజియం అధికారి శ్రీ ఎం. చంద్రశేఖర్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఎస్వీ ఆయుర్వేద కళాశాల అధికారి శ్రీ భాస్కర్ రావు, వీజీవో శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.          

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.