TTD CHAIRMAN INSPECTS ALIPIRI FOOTPATH_ అలిపిరి నడక మార్గంలో టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు
Tirumala, 15 Sep. 19: The Trust Board Chairman of TTD, Sri YV Subba Reddy on Sunday inspected Alipiri Footpath route.
He instructed the shopkeepers to sell the goods for MRP rate only to pilgrims and deviation in this regard will not be spared.
Later he instructed the sanitation staff to clean the bathrooms at regular intervals along the footpath route.
He also interacted with the pilgrims and received feedback on the amenities provided by TTD.
The pilgrims expressed immense satisfaction over the initiatives by TTD.
CHAIRMAN MEETS ART OF LIVING GURU
TTD Chairman Sri YV Subba Reddy has formally met Art of Living Guru Sri Ravishankar in Tirupati on Sunday.
He offered the spiritual Guru, the theertha prasadams of Lord Venkateswara.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అలిపిరి నడక మార్గంలో టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు
సెప్టెంబర్ 15, తిరుపతి, 2019: తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో ఉన్న దుకాణాలను, మరుగుదొడ్లను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మరుగుదొడ్ల లోపల బయట బ్లీచింగ్ వేయాలని అధికారులను ఆదేశించారు.
నడక మార్గంలోని సౌకర్యాల గురించి పలువురు భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే తన కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆహార పదార్ధాలను శుచిగా ఉంచాలని, ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిసిన టిటిడి ఛైర్మన్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఆదివారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తిరుపతిలోని ఒక హోటళ్లో కలిశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీశ్రీ రవిశంకర్ అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మికవేత్త అన్నారు. వారి ఉపన్యాసాలు వింటే మనసు నిలకడగా ఉంటుందన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.