TTD CHAIRMAN INSPECTS PAEDIATRIC AND CANCER HOSPITALS _ మే 5న ముఖ్య‌మంత్రివ‌ర్యుల చేతుల‌మీదుగా చిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

Tirupati, 29 April 2022: TTD Trust Board Chairman Sri YV Subba Reddy along with Tirupati Legislator Sri B Karunakar Reddy inspected the ongoing arrangements at Sri Padmavathi Paediatric and Sri Venkateswara Cancer Hospitals on Friday ahead of the visit of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy which is scheduled on May 5.

Speaking to media persons after inspecting the arrangements for AP CM’s visit along with TTD Additional EO Sri AV Dharma Reddy and JEO Sri Veerabrahmam he said the CM will lay the foundation stone for Children’s Super Speciality Hospital and also inaugurate Sri Venkateswara Institute of Cancer Care and Research Hospital (TATA).

The TTD Board Chief said the CM will also participate in a series of other development programmes between 11am and 1pm on May 5.

Later he directed officials of all TTD departments to co-ordinate efforts in making the arrangements in view of CM’s visit.

Chief Vigilance and Security Officer Sri Narasimha Kishore, Chief Engineer Sri Nageswara Rao, DFO Sri Srinivasulu Reddy, VGO Sri Manohar and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

మే 5న ముఖ్య‌మంత్రివ‌ర్యుల చేతుల‌మీదుగా చిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

–  ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం

–   ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుపతి, 2022 ఏప్రిల్ 29: చిన్న‌పిల్ల‌ల‌కు అధునాతన మెరుగైన వైద్యం అందించేందుకు టిటిడి ఆధ్వ‌ర్యంలో సుమారు రూ.240 కోట్ల వ్య‌యంతో నిర్మించనున్నచిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి మే 5న గౌ. ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శంకుస్థాపన చేయ‌నున్నార‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంతో క‌లిసి శుక్ర‌వారం సాయంత్రం ఛైర్మ‌న్ చిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి స్థ‌లాన్ని, టాటా క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని ప‌రిశీలించారు. అక్క‌డ ముఖ్య‌మంత్రివ‌ర్యుల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చేప‌ట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి అధికారుల‌తో చ‌ర్చించారు.

ఈ  సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ గౌ. ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు చిన్నపిల్లల కోసం బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగణంలో తాత్కాలికంగా శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌య‌ను ప్రారంభించామ‌ని, ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో 300 గుండె ఆప‌రేష‌న్లు చేసి 300 మంది చిన్నారుల ప్రాణాల‌ను కాపాడామ‌ని తెలిపారు. చిన్న‌పిల్ల‌ల‌కు అన్నిర‌కాల వైద్య‌సేవ‌లు అందించేందుకు వీలుగా మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. టాటా ట్ర‌స్టు నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్స‌ర్ కేర్ అండ్ రీసెర్చి ఆసుప‌త్రిని ముఖ్య‌మంత్రివ‌ర్యులు ప్రారంభిస్తార‌ని వెల్ల‌డించారు. అదేవిధంగా, బ‌ర్డ్‌లో స్మైల్ ట్రైన్ వార్డును, మొద‌టి విడ‌తలో పూర్త‌యిన శ్రీ‌నివాస సేతును సిఎం ప్రారంభిస్తార‌ని వివ‌రించారు.

చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌మ‌ణ‌న్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.