TTD CHAIRMAN OFFERS PRASADAMS TO GUV AND CM OF AP _ సీఎం, గవర్నర్ కు టీటీడీ చైర్మన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
Tirumala, 1 Jan. 21: On the occasion of New Year, TTD Chairman Sri YV Subba Reddy on Friday presented the Theertha Prasadams of Lord Venkateswara to Honourable Governor of Andhra Pradesh Sri Biswabhushan Harichandan and Honourable CM of APSri YS Jaganmohan Reddy and extended them New Year Greetings.
The TTD Trust Board Chief along with a team of Vedic Pundits led by Temple OSD Sri P Seshadri formally met AP CM at his camp office in Tadepallegudem and the Vedic Pundits offered Vedasirvachanam followed by presentation of Vastram, Theertha Prasadams, 2021 Calendar and Diary.
Later, they went to Raj Bhavan, the camp office of first citizen of Andhra Pradesh and offered him Vedasirvachanam. The TTD Chairman presented the Seshavastram, Theertham, Laddu Vada Prasadams, Calendar and Diary to the Governor.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
సీఎం, గవర్నర్ కు టీటీడీ చైర్మన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
తిరుమల, 01 జనవరి 2021: నూతన సంవత్సరం సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
శుక్రవారం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసానికి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు అర్చకులతో పాటు చేరుకున్నారు. సి ఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి కి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. చైర్మన్ దంపతులు సి ఎం కు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, టీటీడీ డైరి, క్యాలెండర్ అందించారు. అనంతరం చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి సీఎం ను శేష వస్త్రం తో సత్కరించారు.
ఆ తరవాత చైర్మన్, అర్చకులు రాజభవన్ కు వెళ్లి గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గవర్నర్ ను చైర్మన్ శ్రీవారి శేషవస్త్రం తో సత్కరించి తీర్థ, ప్రసాదాలు అందించారు. అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు. శ్రీవారి ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.