TTD CHAIRMAN RELEASES MANAGUDI POSTERS _ మనగుడి పోస్టర్లను ఆవిష్కరించిన తితిదే ఛైర్మన్‌, ఈవో

TIRUMALA, JULY 13: The TTD Board Chief Sri Kanumuru Bapiraju has released the posters of “Managudi” programme in Tirumala on Saturday along with other board members and ex-officio members at Annamaiah Bhavan.
 
He told media persons that the holy mission has been taken up by TTD jointly with AP Endowments department across ten thousand temples in the state which is scheduled for August 21 on the auspicious occasion of Shravana Pournami.
 
“Each temple will receive a token pack of holy thread, Turmeric, Kumkum powder packets, Prasadam, devotional books and CDs. I appeal to the people to take part in this mass devotional programme and contribute their part preserve the temple heritage which is the epitorme of the rich ancient Hindu culture”.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
      
 

మనగుడి పోస్టర్లను ఆవిష్కరించిన తితిదే ఛైర్మన్‌, ఈవో :

తిరుమల,  13 జూలై  2013 : పాలకమండలి సమావేశంలో తితిదే ఛైర్మన్‌ శ్రీ కనుమూరు బాపిరాజు, ఈవో శ్రీ ఎం.జి.గోపాల్‌ సంయుక్తంగా మనగుడి కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆగస్టు 21వ తేదీన శ్రావణపౌర్ణమి సందర్భంగా తితిదే, రాష్ట్ర దేవాదాయ శాఖతో కలిసి దాదాపు 20 వేల దేవాలయాల్లో మూడో విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 8న ఆలయశోభ, ఆగస్టు 11న ధార్మిక ప్రవచనాలు, ఆగస్టు 12న ప్రతి జిల్లాలోని 108 ఆలయాల్లో కుంకుమార్చన, ఆగస్టు 14న గోపూజ, ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 17న ముఖ్యమైన దళితవాడలు, గిరిజనతాండాలు, మత్స్యకార గ్రామాల్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.