TTD COLLEGES GETS ISO CERTIFICATION _ టిటిడి కళాశాలలకు ఐఎస్ఓ సర్టిఫికెట్
– ISO TEAM DELIVERS CERTIFICATES TO COLLEGE PRINCIPALS THROUGH TTD EO
Tirupati, 3 Sep. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Friday presented the ISO -9001 certificates to the Principals of SV Arts college, Sri Padmavati Degree & PG College, Sri Govindarajaswami Arts college.
Handing over the certificates at his chambers in the TTD Administrative Building, the TTD EO said the Institutions had bagged the universal recognition of ISO-9001 for their excellence in Quality Management System (ISO-9001), Environmental Management System (ISO-14001), Energy Management Standard (ISO-50001) and workplace safety measures.
Sri Alapati Sivaiah MD and Smt Maoulika Director of HyM International Certification Pvt Ltd lauded the cleanliness, Garbage handling and Implementation of Covid-19 guidelines in the TTD institutions.
The TTD EO congratulated the SPW Principal Smt Mahadevamma, SV Arts College Principal Smt Narayanamma, SGS Arts College Principal Sri Venugopal Reddy for maintenance of educational standards environmental protection, power conservation and for documentation in the TTD institutions.
The TTD EO also complimented TTD JEO Smt Sada Bhargavi, TTD education Officer Sri C Govindarajan for their continuous efforts in encouraging the TTD colleges to improve their standards.
FA& CAO Sri O Balaji was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి కళాశాలలకు ఐఎస్ఓ సర్టిఫికెట్
– ఈవో చేతులమీదుగా ప్రిన్సిపాళ్ళకు అందించిన ఐఎస్ఓ బృందం
తిరుపతి, 2021 సెప్టెంబరు 03: టిటిడి నిర్వహణలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పిజి కళాశాల, శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాలలకు ఐఎస్ఓ సర్టిఫికెట్లను శుక్రవారం ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి చాంబర్‌లో ఆయన చేతుల మీదుగా కమిటీ సభ్యులు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళకు అందించారు.
కళాశాలలో డాక్యుమెంట్ల నిర్వహణ, ఉత్తమ మౌళిక సదుపాయాలు, ఉత్తమ విద్యా ప్రమాణాల నిర్వహణకు సంబంధించి ఐఎస్ఓ-9001, కళాశాలల్లో పచ్చదనం పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి ఐఎస్ఓ – 14001 సర్టిఫికెట్లను అందించారు. దీంతో పాటు కళాశాలల కార్యాలయాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్ భవనాల్లో విద్యుత్ పొదుపునకు సంబంధించి ఐఎస్ఓ -50001 సర్టిఫికెట్‌ను అందించారు. టిటిడి కళాశాలల్లో శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, కోవిడ్ – 19 నిబంధనల అమలు ఎంతో బాగున్నాయని హెచ్‌వైఎం ఐఎస్ఓ సర్టిఫికెషన్ ప్రైవేట్ లిమిటెడ్ యండి శ్రీ ఆలపాటి శివయ్య, డైరెక్టర్ శ్రీమతి మౌళిక అభినందించారు.
టిటిడి కళాశాల్లో చక్కటి విద్యా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపు, రికార్డుల నిర్వహణ జరిగేలా చేస్తున్న జెఈవో శ్రీమతి సదా భార్గవి, టిటిడి విద్యా శాఖాధికారి శ్రీ గోవిందరాజన్ ఎస్పిడబ్ల్యు కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి మహదేవమ్మ, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి నారాయణమ్మ, ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డిని ఈవో ఈ సందర్భంగా అభినందించారు.
జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, టిటిడి విద్యా శాఖాధికారి శ్రీ గోవిందరాజన్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.