TTD CONTEMPLATES A NAVAL ANTI-DRONE SYSTEM(NADS) _ నావల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు యోచన

STATE OF ART MUSEUM IN TIRUMALA TO BE READY BY DECEMBER – TTD EO

 

TIRUMALA, 23 JANUARY 23: A Naval Anti-Drone System(NADS) is being contemplated to be introduced in Tirumala soon by TTD which instantly detects and jams micro drones said, TTD EO Sri AV Dharma Reddy.

 

During the media briefing held at Annamaiah Bhavan in Tirumala on Monday, the EO said, the negotiations are going on with Bharat Electronics Limited(BEL) over the procurement of NADS. “As a part of introducing a secured transportation mechanism for pilgrim luggage, TTD is going for a State of Art luggage tagging system which will come into force likely by this April end. “Akin to the Airport Model, we are going for RFID taggings to the luggage of pilgrims”, he added.

 

The EO explained that out of 396 TTD Kalyana Mandapams located across the country, the rentals of only 12 Kalyana Mandapams have been enhanced owing to the request of the devotees, by totally renovating the structure, providing A/C, furniture spending Rs.2.8cr etc. The tariffs of the remaining 384 Kalyana Mandapams are not hiked. He also informed the media about the world-class Museum coming up in Tirumala on donation basis by TATA constructions at Rs.150 crore which will be completed by December.

 

For the first time in the history of TTD, we have released a white paper on all 960 assets extending to an area of about 7,126 acres donated to TTD by various philanthropists for the information of the pilgrim public. Similarly, our bank deposits which were Rs. 13,025 crore in 2019 are now Rs. 15,938 crore while the gold deposits enhanced from 7,339 kilos to 10,258 kilos as per latest statistics.

 

“These figures speak of the transparency in our administrative system and our commitment in discharging our duties and responsibilities for the benefit of devotees”, he asserted. 

 

The EO also put forth the various social welfare activities being operated by TTD with a special focus on health and education. “Besides various schools and colleges, we run specialized institutions like Deaf and Dumb school, polytechnic for physically handicapped, Poor home, old age home, orphanages etc.free of cost. Superspeciality hospitals like SVIMS, BIRRD, and Paediatric hospitals provide impeccable medical services to the needy and poor. A world class Oncology Institute will also come up by the end of this year”, he said. 

 

JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, GM IT Sri Sandeep and others were present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నావల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు యోచన
 
– డిసెంబర్‌ నాటికి తిరుమలలోని స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ మ్యూజియం సిద్ధం
– మీడియా సమావేశంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
 
తిరుమల, 23 జనవరి, 2023: చిన్నపాటి మైక్రో డ్రోన్‌లను కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌(ఎన్‌ఎడిఎస్‌)ను తిరుమలలో ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నట్లు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈఓ మాట్లాడుతూ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కొనుగోలుపై భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)తో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. 
 
భక్తులు డిపాజిట్‌ చేసిన లగేజిని సురక్షితంగా భద్రపరిచి తిరిగి అప్పగించేందుకు విమానాశ్రయాల తరహాలో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. ఇందుకోసం ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగులు వినియోగిస్తామని, ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి ఈ వ్యవస్థ అమల్లోకి రానుందన్నారు.
 
దేశవ్యాప్తంగా 396 టిటిడి కల్యాణ మండపాలు ఉన్నాయని, భక్తుల కోరిక మేరకు వీటిలో 12 కల్యాణ మండపాలను రూ.2.8కోట్లతో పూర్తిగా పునరుద్ధరించి, ఏసీ, ఫర్నీచర్‌ వసతులు కల్పించామని, తదనుగుణంగా మాత్రమే అద్దె పెంచామని ఈఓ వివరించారు. మిగిలిన 384 కల్యాణ మండపాల అద్దె పెంచలేదన్నారు. టాటా సంస్థ అందించిన రూ.150 కోట్ల విరాళంతో తిరుమలలో ప్రపంచ స్థాయి మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని, డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
 
టిటిడి చరిత్రలో మొదటిసారిగా, సుమారు 7,126 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 960 ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసామన్నారు. అదేవిధంగా, 2019లో రూ.13,025 కోట్లుగా ఉన్న టిటిడి బ్యాంకు డిపాజిట్లు ఇప్పుడు రూ.15,938 కోట్లు అని, బంగారం డిపాజిట్లు 7,339 కిలోల నుంచి 10,258 కిలోలకు పెరిగాయని వెల్లడించారు. తద్వారా టిటిడి పాలనలోని పారదర్శకతను, అంకితభావాన్ని తెలుసుకోవచ్చన్నారు.
 
టిటిడి పలు సామాజిక, సంక్షేమ చర్యలు చేపడుతోందని, పలు పాఠశాలలు, కళాశాలలతో పాటు చెవిటి, మూగ పాఠశాలలు, దివ్యాంగుల పాలిటెక్నిక్‌, పూర్‌హోమ్‌, వృద్ధాశ్రమం, అనాథ బాలబాలికల కోసం బాలమందిరం తదితర ప్రత్యేక సంస్థలను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్విమ్స్‌, బర్డ్‌, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి లాంటి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు పేదలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నాయన్నారు. స్విమ్స్‌లో డిసెంబరు నాటికి ప్రపంచ స్థాయి క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు కానుందని తెలిపారు. అదేవిధంగా, రూ.50 కోట్లతో హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిని అభివృద్ధి చేస్తున్నామని, రూ.23 కోట్లతో నూతన పరకామణి భవనం నిర్మించామని తెలియజేశారు. 
 
మీడియా సమావేశంలో టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.