TTD DECIDES TO REINSTATE TERMINATED BARBERS ON HUMANITARIAN GROUNDS FROM JAN 2018_ జ‌న‌వ‌రి 1 నుంచి తిరిగి విధుల్లోకి క‌ల్యాణ‌క‌ట్ట క్షురకులు -మాన‌వ‌తాదృక్ప‌థంతో టిటిడి నిర్ణ‌యం

Tirumala, 13 Nov. 17: Considering their services all these years, Tirumala Tirupati Devasthanams (TTD) has decided to reinstate the contractual barbers from January 1 onwards who were removed from service recently on the allegations of demanding money from pilgrims.

It may be recalled that 130 barbers were removed from service following allegations of demanding money from pilgrims for tonsuring activity while another 95 Kept Out of Duty till January 13 next for their long absence from duties.

But now the management has decided to reinstate them in service from January 1 itself to give them a chance on humanitarian grounds with a final warning of not to indulge and repeat any such malpractice.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 1 నుంచి తిరిగి విధుల్లోకి క‌ల్యాణ‌క‌ట్ట క్షురకులు -మాన‌వ‌తాదృక్ప‌థంతో టిటిడి నిర్ణ‌యం

తిరుమ‌ల‌, 13 నవంబ‌రు 2017: తిరుమ‌ల‌లో త‌ల‌నీలాలు స‌మ‌ర్పిస్తున్న భ‌క్తుల వ‌ద్ద డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో విధుల నుంచి తొల‌గింపున‌కు గురైన క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కుల‌ను 2018, జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి తిరిగి విధుల‌కు అనుమ‌తించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కులు గ‌తంలో అందించిన సేవ‌ల‌ను గుర్తించి, మాన‌వ‌తా దృక్ప‌థంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలియ‌జేసింది.

తిరుమ‌ల‌లోని ప‌లు క‌ల్యాణక‌ట్ట‌ల్లో విధి నిర్వ‌హ‌ణ‌లో డ‌బ్బులు వ‌సూలుచేసిన‌ 130 మంది క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కుల‌ను ఇటీవ‌ల విధుల నుంచి త‌ప్పించిన విష‌యం విదిత‌మే. అదేవిధంగా మూడు నెల‌ల పాటు విధుల‌కు గైర్హాజ‌రైన 95 మంది క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కుల‌ను జనవరి 13వ తేదీ వరకు విధులకు దూరంగా పెట్టారు.

ఈ నేప‌థ్యంలో టిటిడి యాజమాన్యం క్షుర‌కులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీనిని చివ‌రి హెచ్చ‌రిక‌గా భావించి క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కులు నిజాయితీగా సేవ‌లందించాల‌ని కోరింది. త‌ప్పులు పున‌రావృత‌మైతే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌డ‌మైన‌ది.