TTD DEVELOPING VAKULAMATA TEMPLE- TTD CHAIRMAN _ వకుళమాత ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirupati, 23 July 2022: TTD Chairman Sri YV Subba Reddy said that TTD will comprehensively develop Sri Vakulamata temple at Perur Banda near Tirupati.

He visited the temple on Saturday evening along with his spouse, and AP Minister Sri P Ramachandra Reddy, TTD board member Sri P Ashok Kumar. The Chairman said the temple Maha Samprokshana fete was performed on June 23 and the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy also participated on that day.

The TTD Chairman couple were traditionally welcomed by temple Archakas and after darshan they presented pattu vastram to Ammavaru.

Archakas presented Thirtha Prasadams and thereafter the Minister felicitated the TTD Chairman and his spouse with a shawl.

The TTD chairman also lauded the AP Minister for his efforts in temple rejuvenation and its development.

TTD JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, Spl Gr DyEO Smt Varalakshmi and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వకుళమాత ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 23. జూలై 2022: తిరుపతి సమీపంలోని పేరూరు బండ మీద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ తో కలసి శనివారం సాయంత్రం ఆయన సతీ సమేతంగా శ్రీ వకుళ మాత ఆలయాన్ని సందర్శించారు ,ఆలయం వద్ద చైర్మన్ దంపతులకు అర్చకులు అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ప్రదక్షిణగా వెళ్ళి వీరు అమ్మవారిని దర్శించుకున్నారు చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు .అనంతరం అర్చకులు వేద ఆశీర్వాదం చేసి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు . మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి చైర్మన్ దంపతులను శాలువాతో సన్మానించారు. 

అనంతరం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు .గతనెల 23వ తేదీ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయ మహాసంప్రోక్షణలో పాల్గొన్నారని చెప్పారు . ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని ఇక్కడ అవసరమైన అభివృద్ధి పనులన్నీ చేస్తామన్నారు .ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. 

జె ఈవో శ్రీ వీరబ్రహ్మం , చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు , డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది