TTD E-AUCTION OF CLOTHES FROM MAY 21 TO JUNE 2 _ మే 21 నుండి జూన్ 2 వరకు టీటీడీలో వస్త్రాల ఈ-వేలం
Tirupati, May 19, 2026: TTD will conduct an e-auction of clothes offered by devotees at Tirumala Srivari Temple and other TTD temples from May 21 to June 2.
A total of 505 lots, including new, used and partially damaged clothes, will be auctioned. The items include sarees, shawls, lungis, bed sheets, towels, dress materials, carpets, blankets, curtains, umbrellas and other cloth items.
For details, devotees may contact TTD Marketing Office, Tirupati on 0877-2264429 or visit www.konugolu.ap.govt.in / www.tirumala.org
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 21 నుండి జూన్ 2 వరకు టీటీడీలో వస్త్రాల ఈ–వేలం
తిరుపతి,2026మే 19: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మే 21 నుండి జూన్ 2వ తేదీ వరకు ఈ–వేలం ద్వారా విక్రయించనున్నారు.
ఈ వేలంలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి కలిపి మొత్తం 505 లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పాలిస్టర్, నైలాన్, కాటన్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్ పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్షీట్లు, దిండుకవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, పరదాలు, శిరోవస్త్రాలు, గొడుగులు, హుండీ గల్లేబులు, ఈర్వాడాలు తదితర వస్త్ర సామగ్రి ఉన్నాయి.
ఆసక్తి గల వారు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించవచ్చు. అలాగే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.konugolu.ap.govt.in / www.tirumala.org సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
