TTD EARNS Rs.6.52Crores in the e-auction of 6900 kilos of all varieties of human hair_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 6.52 కోట్లు
TTD EARNS Rs.6.52Crores in the e-auction of 6900 kilos of all varieties of human hair.
తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 6.52 కోట్లు
తిరుమల, 2019 జనవరి 03: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ. 6.52 కోట్ల ఆదాయాన్ని గడించింది.
ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 3500 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.
తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.
మొదటి రకం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాటగిరి – 2,300 కిలోలు, కిలో రూ. 18,331/-గా ఉన్న బి క్యాటగిరి – 1700 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.
రెండో రకం తలనీలాలో కిలో రూ.17,009/-గా ఉన్న ఏ క్యాటగిరి – 4,100 కిలోలను వేలానికి ఉంచగా 2700 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.459.29 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా బి క్యాటగిరి – 7,400 కిలోలు వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.17.06 లక్షల ఆదాయం లభించింది.
మూడో రకం తలనీలాలో కిలో రూ.6,020/-గా ఉన్న ఏ క్యాటగిరి 2,800 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.168.58 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,553/-గా ఉన్న బి క్యాటగిరి – 9,800 కిలోలు వేలానికి ఉంచగా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.4.55 లక్షల ఆదాయం సమకూరింది.
కిలో రూ.1,800/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 2,100 కిలోలను వేలానికి ఉంచగా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.80 లక్షల ఆదాయం సమకూరింది.
కిలో రూ.36/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 1,23,000 కిలోలను వేలానికి ఉంచగా 1000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.0.36 లక్షల ఆదాయం సమకూరింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.