TTD EMPLOYEES DONATES 12 TONS OF SUGARCANE TO SV GOSHALA _ ఎస్వీ గోశాల కు 12 టన్నుల చెరకు విరాళం

Tirupati, 23 Aug. 20: In a kind gesture, Sri Anjaneyulu, a TTD employee and TTD Joint Action Committee founder who works as Superintendent, Board Member Cell in Tirumala, on Sunday donated 12 tons of sugarcane to the SV Goshala in Tirupati.

Sri Anjaneyulu who is also SC/ST Employees Association leader handed over the donation worth about ₹1.5 lakhs to the SV Goshala Director Dr. Harnath Reddy.

Later speaking on the occasion he said the donation was made on the occasion of the Ganesh festival and to mitigate food scarcity to animals during Covid-19 environment. He urged the donors to come forward to provide feed and fodder to the animals also.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ గోశాల కు 12 టన్నుల చెరకు విరాళం.

తిరుపతి , 2020  ఆగ‌స్టు 23: టీటీడీ జె ఏ సి వ్యవస్థాపకుడు, ఎస్పీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ నాయకుడు శ్రీ ఆంజనేయులు ఎస్వీ గోశాల కు 12 టన్నుల చెరకు విరాళంగా అందించారు. తన కుమారుడు బాబీ తో కలసి ఆదివారం గోశాల డైరెక్టర్ డాక్టర్ హర నాథ రెడ్డి కి చెరకు అందజేశారు.దీని విలువ లక్షన్నర రూపాయలు ఉంటుందని డైరెక్టర్ చెప్పారు.

దాత ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందులవల్ల మూగజీవాలు ఆహారానికి ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. వినాయక చవితి సందర్భంగా గజరాజులకు ఆహారం అందించాలనే సంకల్పంతో 12 టన్నుల చెరకు విరాళంగా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కరోనా సమయంలో అన్నదానాలు చేస్తున్న దాతలు మూగజీవాల ఆకలి తీర్చడానికి కూడా ముందుకు రావాలని ఆంజనేయులు కోరారు.తాను చెరకు గోశాలకు తరలించడానికి సహకరించిన ట్రాన్స్ పోర్టు జి ఎం శ్రీ శేషారెడ్డి, గోశాల డైరెక్టర్ శ్రీ హరనాథ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.