TTD EO INAUGURATES MAMMOTH LED SCREEN AT TIRUMALA_ తిరుమలలో భారీ ఎల్‌ఈడి స్క్రీన్‌ను ప్రారంభించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 3 August 2017: TTD EO Anil Kumar Singhal along with Tirumala Jeo Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna inaugurated the massive LED screen at Tirumala on Thursday evening by the side of Sahasra Deepalankara Seva Mandapam.

Hyderabad based ACT firm has donated this mammoth LED screen worth Rs.1.70 crores. The TTD mandarins commenced the program telecast on this big screen after performing pujas.

Later speaking on this occasion, TTD EO said, the Brahmotsava Vahana Sevas will be best viewed on this screen. “We will install more such big LED screens at various points in Tirumala in future for the sake of devotees. The quality of programs will also be improved during annual brahmotsavams”, he added.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో భారీ ఎల్‌ఈడి స్క్రీన్‌ను ప్రారంభించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల, 2017 ఆగస్టు 03: తిరుమల శ్రీవారి సహస్రదీపాలంకరణ మండపం ప్రక్కన భారీ ఎల్‌ఇడి స్క్రీన్‌ను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి గురువారం ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ఏ.సి.టి. సంస్థ రూ.1.70 కోట్లతో ఏర్పాటు చేసిన స్క్రీన్‌కు ఈవో, తిరుమల జెఈవో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.

అనంతరం ఈవో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలు, ఉత్సవాలను భక్తులు భారీ స్క్రీన్‌లలో వీక్షించవచ్చని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎస్వీబీసి ద్వారా మరింత నాణ్యమైన కార్యక్రమాలు అందిస్తామన్నారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వాహనసేవలను ఈ భారీ స్క్రీన్‌లలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో మరిన్ని ఎల్‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివి అండ్‌ ఎస్వో శ్రీ రవికృష్ణ, ఏ.సి.టి. సంస్థ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.