TTD EO INSPECTS KALYANA VEDIKA AT VONTIMITTA TEMPLE _ ఒంటిమిట్ట లో కళ్యాణ వేదికను పరిశీలించిన ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి.

Tirupati, 30 Nov. 20: TTD Executive Officer Dr K S Jawahar Reddy on Monday inspected the Rs.17 crore Kalyana Vedika built at Sri Kodandarama Swamy Temple, at Vontimitta in YSR Kadapa district for the annual Kalyanotsava fete.

Speaking on the occasion the TTD EO said in view of Covid-19 guidelines the annual festival of Kodandarama Swamy this year the kalyanotsavam was held in ekantham.

He said in 2021, he is confident that the annual fete will be observed in a big way as the situation will turn to normalcy.

TTD SE Sri Jagadeeshwar Reddy, DyEO of Vontimitta temple Sri. Lokanatham and other officers were also present.

The TTD EO also visited the Sri Parvati sameta Sri Agastheswara Swamy temple in YSR Kadapa district on the occasion of holy Karthika Monday.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట లో కళ్యాణ వేదికను పరిశీలించిన ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి.

తిరుపతి. 30 నవంబరు 2020: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణోత్సవ నిర్వహణ కోసం రూ. 17 కోట్లతో నిర్మించిన కళ్యాణ వేదికను టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణం కమనీయంగా నిర్వహించడానికి కళ్యాణ వేదిక నిర్మించినట్లు చెప్పారు. కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది స్వామి వారి కళ్యాణం ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించామన్నారు. వచ్చే ఏడాది శ్రీ రామనవమి సందర్బంగా తొలిసారి ఈ వేదిక మీద స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. స్వామివారి దయతో అప్పటికి కోవిడ్ పూర్తిగా నశించిపోగలదనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఎస్ఈ 1 శ్రీ జగదీశ్వరరెడ్డి, ఒంటిమిట్ట డిప్యూటి ఈఓ శ్రీ లోకనాథం, డిప్యూటీ ఈఈ శ్రీ హర్షవర్ధన్, ఏఈ శ్రీ దేవరాజు ఈవో వెంట ఉన్నారు.

ఇదిలా ఉండగా కార్తీక సోమవారం సందర్బంగా ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి వై ఎస్ ఆర్ జిల్లా కమలాపురం మండలం టి.చదిపిరాళ్లలోని శ్రీ పార్వతి సమేత అగస్త్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది