TTD EO INSPECTS NEW BUILDING OF SVBC _ ఎస్వీబీసీ నూతన కార్యాలయాన్ని పరిశీలించిన ఈ ఓ డాక్టర్ జవహర్ రెడ్డి.
Tirupati, 27 Oct. 20: TTD Executive Officer Dr K S Jawahar Reddy on Tuesday evening inspected the brand new complex of the Sri Venkateshwara Bhakti Channel (SVBC).
The Additional EO and MD of SVBC Sri AV Dharma Reddy took him around and explained the studios, dubbing, editing and commentary units besides sophisticated state of art equipment.
TTD EO directed the SVBC officials to commence the telecasting and administration operations mod the channel from the new Complex within a month. He instructed the TTD technical and engineering departments to complete all the preparations.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీ నూతన కార్యాలయాన్ని పరిశీలించిన ఈ ఓ డాక్టర్ జవహర్ రెడ్డి.
తిరుపతి. 27 అక్టోబర్ 2020: శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ( ఎస్వీబీసీ) నూతన కార్యాలయాన్ని టీటీడీ ఈఓ. డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అదనపు ఈఓ, ఎస్వీబీసీ ఎండి శ్రీ ధర్మారెడ్డి కార్యాలయంలోని స్టూడియోలు, డబ్బింగ్, ఎడిటింగ్, కామెంటరీ తో పాటు పలు విభాగాల వివరాలను. ఈఓ కు వివరించారు. నెల రోజుల్లో చానల్ ప్రసారాలు, పరిపాలన మొత్తం నూతన భవనం నుంచే జరగాలని ఈఓ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని సాంకేతిక విభాగం, టీటీడీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.