TTD EO INSPECTS SRI VETURI PRABHAKARA SASTRY MANUSCRIPTS AT SVETA _ వేటూరి సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు కృషి : తితిదే ఈవో

వేటూరి సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు కృషి : తితిదే ఈవో

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి సాహిత్యాన్ని భద్రపరిచి భావితరాలకు అందించేందుకు కృషి జరుగుతోందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో గల శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠం కార్యాలయంలో సోమవారం ఆయన పీఠం కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వేటూరి వారి తాళపత్ర గ్రంథాలను శాస్త్రీయ పద్ధతిలో ఓరియంటల్‌ రీసర్చి ఇనిస్టిట్యూట్‌(ఓఆర్‌ఐ) ద్వారా శుద్ధి చేయాలని కోరారు. శాస్త్రిగారి చేతిరాత ప్రతులను డిజిటలైజేషన్‌ చేయించాలన్నారు. ఆయన సేకరించిన గ్రంథాలను బైండింగ్‌ చేయించి భద్రపరచాలని సూచించారు. వీలైనంత త్వరగా శాస్త్రి గారి గ్రంథాలను ముద్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పీఠం కార్యాలయాన్ని విస్తృతపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సమీక్షలో తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠం ప్రత్యేకాధికారి ఆచార్య రవ్వా శ్రీహరి, వేటూరి తనయుడు శ్రీ వేటూరి ఆనందమూర్తి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.