TTD EO INSPECTS TIRUMALA GARDENS WORKS _ తిరుమలలో మరింత పచ్చదనం పెంపునకు ప్రణాళికలు
Tirumala, 18 Mar. 22: TTD EO Dr KS Jawahar Reddy on Friday inspected the ongoing works at the sacred flower gardens at Tirumala.
Responding to EO suggestions to grow fruit plants for use in Srivari kaikaryas at Narayana gardens, the GMR representatives said that they had already taken up the planting of fruit-bearing varieties, which they will give for Srivari kaikaryas.
TTD EO also went around Special type cottages and development works of Narayana gardens, Gardens inside Geeta Park and made valuable suggestions to concerned officials to expedite the works undertaken by the corporate groups GMR and phoenix foundation.
The TTD EO also visited the Naga thirtha region and also inspected the Goshala extension works,
Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, SE-2 Sri Jagadeeswar Reddy, DFO Sri Srinivasulu Reddy, Health officer Dr Sridevi, Garden Deputy director Sri Srinivasulu, VGO Sri Bali Reddy, GMR representative Sri Mahender and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో మరింత పచ్చదనం పెంపునకు ప్రణాళికలు
ఉద్యానవనాల పెంపకం పనులను పరిశీలించిన ఈఓ
తిరుమల, 2022 మార్చి 18: తిరుమలలో ఉద్యానవనాలను అభివృద్ధి చేయడం ద్వారా మరింత పచ్చదనం పెంపునకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఉద్యానవనాల పెంపకం కోసం జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు.
స్పెషల్ టైప్ కాటేజీల వద్ద, శ్రీవారి మెట్టు నడకమార్గంలో తిరుమలకు చేరుకునే ప్రదేశంలో భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా పూలమొక్కలు, పచ్చదనం పెంచాలని సూచించారు. నారాయణగిరి ఉద్యానవనాల ప్రాంతంలో, గీతా పార్కులో ఆకర్షణీయంగా ఉద్యానవనాలను పెంచాలన్నారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో పండ్ల మొక్కల పెంపకంపై ఈఓ చర్చించారు. పలు రకాల పండ్ల మొక్కలు నాటామని, వీటి ద్వారా వచ్చే ఫలాలను స్వామివారి కైంకర్యానికే పంపుతామని జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఉద్యానవనాల అభివృద్ధి పనుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఈఓ పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై జిఎంఆర్, ఫీనిక్స్ ఫౌండేషన్ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. అనంతరం నాగతీర్థాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న గోశాల విస్తరణ పనులను ఈఓ పరిశీలించారు.
ఈవో వెంట టిటిడి అదనపు ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులురెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, విజిఓ శ్రీ బాలిరెడ్డి, జిఎంఆర్ సంస్థ ప్రతినిధి శ్రీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.