TTD EO INSPECTS UP GHAT ROAD _ మ‌నంద‌రినీ కాపాడిన శ్రీ‌వారికి మనఃపూర్వక కృత‌జ్ఞ‌త‌లు – టిటిడి ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి

SRIVARU SAVED US ALL AVERTING A MAJOR ACCIDENT ON DEC 1

TIRUMALA, 04 DECEMBER 2021: Sri Venkateswara Swamy has saved all His devotees and also sent a caution signal about the landslides and measures to be taken to avert such incidents in future, said TTD EO Dr KS Jawahar Reddy.

The TTD EO inspected the landslide areas in Up Ghat road on Saturday and gave necessary instructions to the officials concerned. Earlier, TTD Chief Engineer Sri Nageswara Rao explained the EO about the landside places, ongoing Ghat road restoration works, etc.

Later speaking to media persons EO said, a huge boulder has fallen near Bhashyakarla Sannidhi at the Up Ghat road during the early hours on December 1 due to recent rain havoc, severely damaging the ghat road at four different points. “Srivaru had once again proved His presence in protecting devotees by averting major landslide accident. There were vehicles when the incident occurred. But Srivaru saved all without hurting anyone and we thank Venkateswara Swamy for protecting all of us. However we consider this as a warning signal sent to us by Almighty to step up measures to avert such incidents in future”, EO maintained.

Adding further he said as it takes time to restore these roads, we have already invited IIT expert from New Delhi. Another institution, Amrita Viswa Vidyapeetham, Kollam from Kerala which is doing a project under the World Centre of Excellence on Landslide Risk Reduction will also arrive today. They will inspect the risk areas in Ghat roads both physically as well with the help of drones and study every square meter on how to arrest these landslides.

After their study report, we will see how best we can avert such incidents in future by enhancing soil binding growing more greenery in ghat roads, carrying out civil works using advanced technology, Geo engineering techniques etc. The Kerala institute has also informed us about providing an Early Warning System preparing us to prevent such incidents in future.

The EO said that the TTD Engineering staff also requires training on how to avert such incidents. They will be trained up in the Himalayan Studies, Kerala, regions in Western ghats and also in countries which are prone to such incidents in common, the technology they used to prevent landslides and also to improve our in-house knowledge and exposure in this area”, he added.

The EO reiterated that the Up Ghat road will be brought into utility only when it is completely restored keeping in view the safety aspects of pilgrims. Till that time the link road will be under operation.

The EO said, Papavinasanam and Akasa Ganga will be opened up for pilgrims in a few days.

JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, VGO Sri Bali Reddy, EE Sri Surendra Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మ‌నంద‌రినీ కాపాడిన శ్రీ‌వారికి మనఃపూర్వక కృత‌జ్ఞ‌త‌లు – టిటిడి ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి

– కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతాల‌ను ప‌రిశీలించిన ఈవో

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 04: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు మనందరినీ రక్షించి భక్త వత్సలుడని మరోమారు చాటి చెప్పారని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పున‌రావృతం కాకుండా ముంద‌స్తుగా తీసుకోవాల్సిన చర్యల గురించి తమను హెచ్చరించార‌న్నారు.

ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు, టిటిడి ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి శ‌నివారం ఈవో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతాన్ని, లింక్ రోడ్డును ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు డిసెంబర్ 1న తెల్లవారుజామున రెండ‌వ‌ ఘాట్ రోడ్డులోని భాష్యకార్ల సన్నిధి సమీపంలో భారీ బండరాయి పడి నాలుగు వేర్వేరు ప్రాంతాల‌ వద్ద ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింద‌న్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు వాహనాలు ఉన్నాయ‌ని, కానీ శ్రీవారు అనుగ్ర‌హంతో ఎవరికీ చిన్న ప్ర‌మాదం కలగకుండా అందరినీ రక్షించినందుకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మ‌రోమారు ధన్యవాదాలు తెలిపారు.

అప్ ఘాట్ రోడ్డు పూర్తిగా త‌నిఖీ చేశామ‌ని, ఢిల్లీ ఐఐటి ప్రొఫెస‌ర్లు క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేశార‌ని చెప్పారు. ఇందుకోసం అప్ ఘాట్ రోడ్డులో పూర్తి స్థాయిలో మ‌ర‌మ్మ‌త్తులు చేసి తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని, అంత‌వ‌ర‌కు అప్ ఘాట్ రోడ్డులో వాహ‌నాల‌ను అనుమ‌తించి లింక్ రోడ్డు ద్వారా మోకాళ్ళ మెట్టు నుండి తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌డం ద్వారా భ‌క్తుల‌కు అసౌక‌ర్యం త‌గ్గించిన‌ట్లు వివ‌రించారు.

కేర‌ళ రాష్ట్రం కొల్లంలోని అమృత విశ్వ‌విద్యాల‌యం నుండి వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కింద ప్రాజెక్ట్ చేస్తున్న పరిశోధక నిపుణుల బృందం శ‌నివారం రెండ‌వ ఘాట్ రోడ్డును ప‌రిశీలించ‌నున్న‌ట్లు చెప్పారు.

ఢిల్లీ ఐఐటి నిపుణులు, కొల్లం ల్యాండ్‌స్లైడ్స్ నిపుణుల బృందం నివేదికలు ప‌రిశీలించి, వారి సాంకేతిక స‌ల‌హాల‌తో త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు, భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా అత్యాధునిక శాస్త్ర ప‌రిజ్ఞానం ఉప‌యోగించుకొని డ్రోన్ల ద్వారా క్షుణంగా స‌మ‌గ్ర స‌ర్వే నిర్వ‌హించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అప్ ఘాట్ రోడ్డులో చేయ‌వ‌ల‌సిన సివిల్ ప‌నులు చేయ‌డం, మట్టి బంధాన్ని మెరుగుపరచడం, ప‌చ్చ‌ద‌నం పెంపొందించ‌డం, జీయో ఇంజినీరింగ్ వాడుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

అదేవిధంగా టిటిడి ఇంజినీరింగ్ అధికారుల‌కు, సిబ్బందికి ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కునేందుకు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం హిమాలయాలు, కేరళ, పశ్చిమ కనుమలలోని ప్రాంతాలు, సాధారణంగా ఇటువంటి సంఘటనలు జరిగే దేశాలలో కొండచరియలు విరిగిపడకుండా నిరోధించడానికి ఉపయోగించిన సాంకేతికతపై వారికి శిక్షణ ఇవ్వనున్న‌ట్లు చెప్పారు.

త్వ‌ర‌లో అధికారుల‌తో చ‌ర్చించి పాపావినాశ‌నం, ఆకాశ‌గంగ‌ మార్గాల్లో భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌న్నారు.

అంత‌కుముందు సిఇ శ్రీ నాగేశ్వర రావు అలిపిరి నుండి లింక్ రోడ్డు వ‌ర‌కు అప్ ఘాట్ రోడ్డులో జ‌రుగుతున్న ప‌నుల‌ను ఈవోకు వివ‌రించారు.

ఈవో వెంట జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎస్ఇ – 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, విజీవో శ్రీ బాలిరెడ్డి, ఈఈ శ్రీ సురేంద్రరెడ్డి, ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.