TTD EO OFFERS SRIVARI SARE TO KANIPAKA VINAYAKA_ కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకునికి టిటిడి సారె

Tirupati, 2 September 2017: As a gift from Lord Venkateswara, TTD EO Sri Anil Kumar Singhal presented the “Sare” to Kanipaka Varasiddhi Vinayaka Swamy on Saturday.

TTD has been following this custom of presenting sare to Kanipaka Vinayaka on the celestial occasion of “Tirukalyana Mahotsavam” of Sri Vinayaka Swamy from the past few years.

On his arrival to this famous shrine, TTD EO was accorded warm welcome bt Kanipakam temple EO Sri Purna Chandra Rao.

After offering the sare, TTD EO had the darshan of Sri Varasiddhi Vinayaka Swamy. Later the temple EO offered prasadams and lamination photo of Lord to TTD EO. Tirumala temple Parupattedar Sri Gururaja Swamy also accompanied TTD EO.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకునికి టిటిడి సారె

సెప్టెంబరు 02, తిరుపతి, 2017: శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకునికి శనివారంనాడు టిటిడి ఈఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తిరుమల శ్రీవారి తరఫున సారెను బహూకరించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ప్రస్తుతం జరుగుతున్న వార్షిక బ్రహ్మూెత్సవాలలో భాగంగా శనివారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుగనుంది. ఈ శుభ సందర్భంగా టిటిడి సారెను అందించడం ఆనవాయితీగా వస్తోంది.

శ్రీ కాణిపాకం దేవాలయ ఈఓ శ్రీ పూర్ణచంద్రరావు, టిటిడి ఈఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఈఓ శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి శ్రీవారి సారెను బహూకరించారు. అటు తరువాత సత్యప్రమాణాల స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం కాణిపాకం దేవాలయ ఈఓ టిటిడి ఈఓకు ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు.శ్రీవారి ఆలయ బొక్కసం సూపరింటెండెంట్‌ శ్రీ గురురాజారావు కూడా ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.