TTD EO PRESENTS SILK VASTRAMS TO SRI BHAKTAVATSALA PERUMAL _ తిరునిన్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పణ

Tirupati, 13 March 2020: As a traditional practice, TTD EO Sri Anil Kumar Singhal along with Addl.EO Sri AV Dharma Reddy presented Silk Vastrams on behalf of TTD to Sri Bhaktavatsala Perumal of Tirunindravur in Tamilnadu on Friday and offered prayers in this ancient and famous Vaishnavaite temple.

This temple is considered as one of the 108 Divyadesams dedicated to Lord Vishnu, who is worshipped here as Sri Bhaktavatsala Perumal and His consort Lakshmi is referred to as “Ennai Petra Thayar”.

The temple is believed to have been built by the Pallavas of the late 8th century AD, with later contributions from Medieval Cholas and Vijayanagar kings. 

Meanwhile the annual brahmotsavams are currently going on in this temple and most famous religious fete Rathotsavam took place on Saturday. Tirumala Pedda Jiyar Swami, Chinna Jiyar Swami, Seshadri Swami also participated in this religious fete along with TTD EO.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

తిరునిన్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పణ
 
తిరుప‌తి, 2020 మార్చి 13: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరునిన్రవూరులో గల చారిత్రక పురాతనమైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌ ఆలయానికి శుక్ర‌వారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి శ్రీశ్రీ‌శ్రీ‌ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీ‌శ్రీ‌ చిన్నజీయర్ స్వామి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశ్రీ‌శ్రీ‌ పెద్దజీయర్‌స్వామివారు ఈ ఆలయానికి ఆధ్యాత్మికపెద్దగా వ్యవహరిస్తున్నారు. స్వామివారి కోరిక మేరకు 2010వ సంవత్సరం నుండి ఈ ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి శ్రీవారి కానుకగా పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.
 
ముందుగా తిరునిన్రవూరులోని శ్రీశ్రీ‌శ్రీ‌ పెద్దజీయర్‌స్వామివారి మఠానికి టిటిడి ఈవో చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి నుంచి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్టు తెలిపారు. తిరు అనగా ‘శ్రీ లక్ష్మీ’ అని, నిన్ర అనగా ‘నిలబడి’ అని, వూరు అనగా ‘ప్రదేశం’ అని అర్థమని, శ్రీలక్ష్మీదేవి నిలబడి ఉన్న ప్రదేశంగా తిరునిన్రవూరు గుర్తింపు పొందిందని వివరించారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం ఒకటి అని చెప్పారు. 
 
ఈ కార్యక్రమంలో  తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం ఇంఛార్జి శ్రీ గురురాజ స్వామి, వేదపారాయణదారులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.