TTD EO SRI AV DHARMA REDDY PRESENTED VASTRAMS TO SRI KALAHASTISWARA _ శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

Tirumala, 10 March 2024: On behalf of TTD, EO Sri AV Dharma Reddy presented pattu vastrams to Srikalahasti temple on the occasion of the auspicious Siva Parvati Kalyanotsavam on Sunday as part of the Mahashivaratri celebrations.

The TTD EO reached the temple and was welcomed by Sri Kalahasti Temple  Chairman Sri Anjuru Srinivasulu, EO Sri Nageswara Rao and other members.

Later the TTD EO had darshan of Sri Vayulingeshwara, Sri Gnana Prasunamba and Sri Guru Dakshinamurthy. 

Sri Lokanatham, Deputy EO of Srivari Temple and others participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుమల, మార్చి 10, 2024: మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం శ్రీ జ్ఞానప్రసూనాంబ, శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి కల్యాణోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని టీటీడీ తరఫున ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు శ్రీ‌కాళ‌హ‌స్తి ఆలయ పాల‌క‌ మండలి ఛైర్మన్ శ్రీ అంజూరు శ్రీనివాసులు, ఈవో శ్రీ నాగేశ్వ‌ర‌రావు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. ఆల‌య అర్చకులు శ్రీ ధర్మారెడ్డికి తలపాగా చుట్టి పట్టువస్త్రాలు తలమీద ఉంచారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న ఈవో, ఇతర ముఖ్యులతో కలసి శ్రీ సోమస్కంద‌మూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

అనంతరం శ్రీ వాయులింగేశ్వరుడు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, శ్రీ గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.