TTD EO TAKES PART IN NYAYA SUDHA PARAYANA_ శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన న్యాయసుధా పారాయణం
శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన న్యాయసుధా పారాయణం
తిరుమల, 2012 జూలై 04: విశ్వకళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ తితిదే న్యాయసుధా పారాయణం కార్యక్రమాన్ని బుధవారం శ్రీవారి ఆలయంలో ప్రారంభించింది. 5 రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని బుధవారంనాడు సంకల్పంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. వేదవ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రాలను న్యాయసుధగా శ్రీ మధ్వాచార్యులవారు సరళీకరిస్తే జయతీర్థుల వారు దీనికి టీకాతాత్పర్యం రాసి మరింత సరళీకృతం చేశారు.
ఈ నేపథ్యంలో సకలజన శ్రేయస్సు కోసం ఉడిపి, పెజావర్, ఉత్తరాది మఠాలకు చెందిన 12 మంది పండితులు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయం విమాన ప్రాకారం చెంత ఈ పారాయణాన్ని ప్రారంభించారు. ఈ బ్రహ్మసూత్రాలను ఉదయం 6.00 గంటల నుండి 10.00 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పారాయణం చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.