TTD EXPERIMENTS SSD COUNTERS WITH ITS EMPLOYEES AND TCS STAFFS_ టిటిడి ఉద్యోగులు, టిసిఎస్‌ సిబ్బందికి ప్రయోగాత్మకంగా సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు

Tirumala, 26 April 2018: As TTD is all set to launch the Slotted Sarva Darshan (SSD) counters soon for the pilgrim public, in a trial-run, the staff members of both TTD and TCS have taken the tokens on Thursday in the SSD counters of RTC bus stand in Tirumala.

Speaking on this occasion, Tirumala JEO Sri KS Sreenivasa Raju said, with an aim to minimize the inconvenience of long waiting hours to the pilgrims in queue lines and compartments, TTD has contemplated for SSD counters. A week-long trial-run with Aadhaar as mandatory was made in December last which yielded successful results.

However, in the wake of the legal restrictions imposed on Aadhaar card by the Apex Court, TTD has now made SSD viable for both Aadhaar and Voter IDs. In the next few days we will allow limited number of pilgrims only in this RTC bus stand SSD counter to verify and assess working of the application.

To assess the same, an experiment with TTD and TCS employees will be done for next few days before being launched in the public in a full-fledged manner. As the TTD board will also sworn in next couple of days, we will launch SSD counters on an auspicious day”, he added.

SE II Sri Ramachandra Reddy, GM Sri Sesha Reddy, ACVSO Sri Siva Kumar Reddy, VSO Sri Ravindra Reddy, PRO Dr T Ravi, EEs Sri Prasad, Sri Venkateswarulu, EDP OSD Sri Balaji Prasad, TCS Team head Sri Satya, DM RTC Tirumala Depot Sri Lakshmi Narasimha Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

టిటిడి ఉద్యోగులు, టిసిఎస్‌ సిబ్బందికి ప్రయోగాత్మకంగా సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు

ఏప్రిల్‌ 26, తిరుమల 2018: భక్తుల సౌకర్యార్థం త్వరలో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం టిటిడి ఉద్యోగులకు, టిసిఎస్‌ సిబ్బందికి ప్రయోగాత్మకంగా టిటిడి టోకెన్లు జారీ చేసింది. తిరుమలలోని ఆర్‌టిసి బస్టాండులో గల కౌంటర్లలో ఈ టోకెన్లు జారీ చేశారు.

ఈ సందర్భంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. డిసెంబరులో ఆధార్‌ నంబరు ద్వారా వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం విజయవంతమైందన్నారు. ప్రస్తుతం న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా ఆధార్‌ కార్డు లేదా ఓటర్‌కార్డును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్‌టిసి బస్టాండులో గల కౌంటర్లలో కొన్ని రోజులపాటు పరిమితసంఖ్యలో భక్తులకు టోకెన్లు మంజూరుచేసి అప్లికేషన్‌ పనితీరును పరిశీలిస్తామన్నారు. రెండు రోజుల్లో టిటిడి ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం చేయనుందని, ఆ తరువాత సర్వదర్శనం కౌంటర్లను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఇఇలు శ్రీ ప్రసాద్‌, శ్రీ వేంకటేశ్వర్లు, ఇడిపి ఓఎస్‌డి శ్రీ బాలాజిప్రసాద్‌, టిసిఎస్‌ అధికారి శ్రీ సత్య, ఆర్‌టిసి డిఎం శ్రీ లక్ష్మీనరసింహారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.