TTD EXTENDS SRIVANI VIP BREAK DARSHAN TIME LIMIT _ శ్రీ‌వాణి ట్ర‌స్టు ద‌ర్శ‌నం టికెట్ల‌ కాల ప‌రిమితి పెంపు ‌      

Tirumala, 30 Jul. 20: TTD has extended the time span of VIP Break Darshan tickets offered on donations to the Srivani Trust from the present six months duration to one year.

‌Following requests from devotees in view of Covid-19 restrictions prevailing across the country and even overseas, TTD has facilitated the devotees holding such break tickets to utilise them in the next 12 months.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వాణి ట్ర‌స్టు ద‌ర్శ‌నం టికెట్ల‌ కాల ప‌రిమితి పెంపు ‌      

తిరుమ‌ల‌, 2020 జూలై 30: తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా బ్రేక్ టికెట్లు పొందిన భ‌క్తుల సౌక‌ర్య‌ర్థం ఒక  సంవ‌త్స‌రంలోపు స్వామివారిని దర్శించుకునే అవ‌కాశం టిటిడి కల్పించింది.
   
ప్ర‌పంచ ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న‌ నేప‌థ్యంలో భ‌క్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు శుక్ర‌వారం నుండి శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రూ. 10 వేలు చెల్లించి టికెట్లు పొందిన భ‌క్తుల ద‌ర్శ‌న కాలాన్ని ప్ర‌స్తుతం ఉన్న 6 నెల‌ల కాల ప‌రిమితిని సంవ‌త్స‌రా‌నికి టిటిడి పెంచ‌డ‌మైన‌ది. ఇదివ‌ర‌కే ఆన్‌లైన్‌లో శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు సంవ‌త్స‌రంలోపు వినియోగించుకోవ‌ల‌సి ఉంటుంది. కావున ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించ‌గ‌ల‌రు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.