TTD FILES POLICE COMPLAINT ON FAKE PORTALS _ న‌కిలీ వెబ్‌సైట్‌పై పోలీసుల‌కు టిటిడి ఫిర్యాదు

Tirupati, 9 Jul. 20: TTD Vigilance department on Thursday filed a complaint at Tiruchanoor police station against fake portals which cheated devotees assuring booking online Srivari Darshan tickets.

It is said that a devotee from Tirupati working as RTC conductor tried to book Srivari Special darshan tickets online and was induced by a fake website www.ttddarshans.com to submit details and pay online with the assurance that the tickets will be sent by email only.

When the person failed to get any email or darshan tickets the person brought it to notice of TTD officials. Thereafter the TTD vigilance department swung into action and identified the fake website and filed a police complaint for stringent action on the operators of the website.

Buy TTD Srivari darshan tickets by authorised websites only, TTD appeals. Following the episode the TTD had reiterated its appeal to all devotees to book all Srivari Darshan, Arjitha Seva tickets and accommodation only through official TTD websites and not get cheated by trusting fake or dummy portals.

As of now TTD has received numerous complaints from devotees that many of them have been. Heated by fake portals. The TTD vigilance and security officials have so far filed criminal cases on 20 such fake websites.

TTD officials reiterated that the www.tirupatibalaji.ap.gov.in was the only official site authorised to issue arjita Seva, Srivari darshan and rooms tickets. For all information with regard to the Tirumala Tirupati Devasthanams the official website was www.tirumala.org

For more information on TTD websites, contact 1800425333333, 18004254141 Ph.0877-2277777, 0877-2233333

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

న‌కిలీ వెబ్‌సైట్‌పై పోలీసుల‌కు టిటిడి ఫిర్యాదు

తిరుపతి, 2020 జూలై 09: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేస్తామ‌ని భ‌క్తుల‌ను మోసం చేస్తున్న న‌కిలీ వెబ్‌సైట్‌పై టిటిడి విజిలెన్స్ విభాగం తిరుచానూరు పోలీస్ స్టేష‌న్‌లో గురువారం ఫిర్యాదు చేసింది.

తిరుప‌తి మంగ‌ళం ఆర్‌టిసి డిపోలో కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ర‌ఘు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకోవ‌డానికి ఆన్‌లైన్లో ప్ర‌య‌త్నించ‌గా ttddarshans.com అనే న‌కిలీ వెబ్‌సైట్ క‌నిపించింది. ర‌ఘు ఈ వెబ్‌సైట్ ద్వారా ద‌ర్శ‌న టికెట్ల కోసం వివ‌రాలు స‌మ‌ర్పించి ఆన్‌లైన్‌లో న‌గ‌దు బ‌దిలీ చేశారు. న‌గ‌దు బ‌దిలీ ప్ర‌క్రియ పూర్త‌య్యాక మెయిల్ ఐడికి ద‌ర్శ‌న టికెట్లు పంపుతామ‌ని ఈ న‌కిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కులు న‌మ్మించారు. ఆ త‌రువాత ద‌ర్శ‌నం టికెట్లు రాక‌పోవ‌డంతో తాను మోస‌పోయాన‌ని గుర్తించిన ర‌ఘు టిటిడి అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. స‌ద‌రు వెబ్‌సైట్ న‌కిలీద‌ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు ttddarshans.com అనే వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అధికారిక వెబ్‌సైట్‌లోనే టికెట్లు బుక్ చేసుకోండి : భ‌క్తుల‌కు టిటిడి విజ్ఞ‌ప్తి

శ్రీ‌వారి భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు, ఆర్జిత‌ సేవా టికెట్లు, గ‌దుల‌ను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ల‌ను మాత్ర‌మే వినియోగించాల‌ని టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగం విజ్ఞ‌ప్తి చేస్తోంది. న‌కిలీ వెబ్‌సైట్ల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది.

న‌కిలీ వెబ్‌సైట్ల‌ను సంప్ర‌దించి మోస‌పోయిన‌ట్టు ప‌లువురు భ‌క్తుల నుండి టిటిడికి ఫిర్యాదులు అందాయి. ఈ మేర‌కు టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగం అధికారులు ఇప్ప‌టికే దాదాపు 20 న‌కిలీ వెబ్‌సైట్ల‌పై పోలీస్ స్టేష‌న్ల‌లో క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయించి వాటి మీద చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది.

శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు, ఆర్జిత‌ సేవా టికెట్లు, గ‌దుల‌ను బుక్ చేసుకునేందుకు అధికారికంగా tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ మాత్ర‌మే ఉంది. తిరుమల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల‌కు సంబంధించిన స‌మాచారం కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. ఈ వెబ్‌సైట్ల‌కు సంబంధించిన స‌మాచారం, ఇత‌ర వివ‌రాల కోసం టిటిడి కాల్ సెంట‌ర్‌ను టోల్‌ఫ్రీ : 18004254141, 1800425333333, 0877-2277777, 0877-2233333 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.