TTD GEARS UP FOR BIG FETE _ శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి, 24న వైకుంఠ ద్వాద‌శి

SSD TOKENS CANCELLED ON DECEMBER 22 FOR SAME-DAY DARSHAN

Issuance of Vaikunthadwara Darshan tokens in all counters on December 22 from 2pm onwards

Tirumala, 20 December 2023: TTD has made elaborate arrangements for providing Ten-day long Vaikuntadwara Darshan at Srivari temple for devotees coming from across the country between  December 23 and January 1.

Since the Vaikuntadwara Darshan tokens will be issued at 90 centres in nine locations in Tirupati from 2pm of  December 22 onwards, TTD has cancelled the slotted Sarva Darshan tokens for same day Darshan.

Hence Devotees should note that they could go for Srivari Darshan through the Vaikunta Queue Complex on December 22.

Other programs

On December 23 on the day of Vaikuntha Ekadasi, Sri Malayappa Swami along with His consorts Sridevi and Bhudevi will take a ride on Swarna Ratham (Golden Chariot) and bless devotees between 9am and 11am.

Similarly, on the Nada Neeranjanam platform, the Bhagavad Gita Akhanda Parayanam and Vishnu Sahasranama Stotra Parayanam will be held on the occasion.

Likewise on December 24 on Vaikuntha Dwadasi day, Chakra Snanam also known as Swami Pushkarani Theertha Mukkoti will be observed between 4.30am and 5.30 am.

In view of ten day long festivities, TTD has cancelled all Arjita Sevas and VIP Break darshans. As in past this year also the protocol VIPs and their family members will be given srivari Darshan in limited manner and no recommendation letters will be accepted during these ten days.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి, 24న వైకుంఠ ద్వాద‌శి

•⁠ ⁠డిసెంబ‌రు 22న అదేరోజు దర్శనానికి సంబంధించిన స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల ర‌ద్దు

•⁠ ⁠డిసెంబ‌రు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుప‌తిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభం

తిరుమల, 2023 డిసెంబ‌రు 20: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌డుతోంది. ఈ సంద‌ర్భంగా డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

డిసెంబ‌రు 22న అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుప‌తిలో మంజూరు చేసే స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. భ‌క్తులు తిరుమ‌ల‌లో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా స‌ర్వ‌ద‌ర్శ‌నంలో ఆరోజు శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. డిసెంబ‌రు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుప‌తిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టోకెన్ల జారీ ప్రారంభమవుతుంది. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్ల జారీ జరుగుతుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

కార్యక్రమాల వివరాలు

డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి నాడు ఉదయం 9 నుండి 10 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తారు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 ఆధ్యాయాల్లో గ‌ల 700 శ్లోకాలతో సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం చేస్తారు. సాయంత్రం 6 గంట‌ల నుండి శ్రీ విష్ణు సహస్రనామ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు.

డిసెంబ‌రు 24న వైకుంఠ ద్వాదశిని పుర‌స్క‌రించుకుని తెల్ల‌వారుజామున 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ సుద‌ర్శ‌న చక్రత్తాళ్వార్ల చ‌క్ర‌స్నాన మ‌హోత్స‌వం వైభ‌వంగా జ‌రుగ‌నుంది. ఈరోజును స్వామి పుష్క‌రిణి తీర్థ ముక్కోటి అని కూడా పిలుస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

•⁠ ⁠ఈ ప‌ర్వ‌దినాల నేప‌థ్యంలో డిసెంబ‌రు 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు, డిసెంబ‌రు 31, జ‌న‌వ‌రి 1వ తేదీల్లో శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. స‌హ‌స్ర దీపాలంకార సేవ‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

•⁠ ⁠ఈ ప‌ది రోజుల పాటు ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

•⁠ ⁠గ‌తంలో వ‌లెనే ఈ సంవ‌త్స‌రం కూడా స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్ విఐపిల‌కు, కుటుంబ సభ్యులకు ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఇవ్వ‌బ‌డుతుంది. 10 రోజుల పాటు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.