TTD GEARS UP FOR ONTIMITTA BTUs_ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు :  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 9 March 2018: As the annual fete of TTD under taken temple at Ontimitta in YSR Kadapa district are set to commence from March 24 and conclude on April 3 EO Sri Anil Kumar Singhal instructed the departments to make elaborate arrangements for the same.

Reviewing with officials in TTD administrative building in Tirupati on Friday evening the EO instructed the engineering wing to erect pandals, queue lines, barricading near Kalyana vedika etc. “Make electrical Illuminations and floral decorations near temple as well at kalyana vedika. On the day of Sita Rama Kalyanam on March 30 as thousands of pilgrims witness the fete, he directed Annaprasadam wing, health and security to make necessary arrangements. Provide three lakh water packets on that day and arrange 200 temporary toilets and keep the premises clean. Security should be arranged in cooperation with SP of Kadapa, he directed CVSO Sri A.Ravikrishna.

The EO also instructed the Medical wing to set up first aid centres with adequate medicines and directed PRO Dr T Ravi to deploy 1000 sevakulu.

SO of All Projects Sri.Muktheswara Rao, FACAO Sri Balaji, Health Officer Dr Sermista DyEOs Smt Goutami, Sri Lakshman Naik were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు :  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

మార్చి 09, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం చలువపందిళ్లు, బ్యారీకేడ్లు, క్యూలైన్లు, కల్యాణం కోసం వేదిక తదితర ఇంజినీరింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయం, పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద శోభాయమానంగా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని, స్వాగత ఆర్చిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్చి 30వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి వేలాది మంది భక్తులు విచ్చేసే అవకాశముందని, భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందుల లేకుండా కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాటు చేయాలని సివిఎస్‌వోకు సూచించారు. కల్యాణం రోజు 3 లక్షల తాగునీటి ప్యాకెట్లను అందించాలని, 200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుచేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగినంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. వేదిక ఇరువైపులా అన్నప్రసాద వితరణకు 200 కౌంటర్లు ఏర్పాటుచేయాలన్నారు. భక్తులకు సమాచారం, సూచనలిచ్చేందుకు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయాలన్నారు.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రామాయణ సందేశాన్ని తెలిపే భక్తి ఆధ్యాత్మిక పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలని, వాహనసేవల్లో మెరుగైన కళాబృందాలను ఏర్పాటు చేయాలని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ అధికారులను ఈవో ఆదేశించారు.  భక్తులకు వైద్యసేవలందించేందుకు మందులు, తగినంతమంది సిబ్బందిని అందుబాటులో  ఉంచుకోవాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు 1000 మంది శ్రీవారి సేవలకులను ఆహ్వానించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లక్ష్మణ్‌ నాయక్‌, డెప్యూటీ ఈవో(జనరల్‌) శ్రీమతి గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లు ఆవిష్కరణ

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లను శుక్రవారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మార్చి 25న శ్రీరామనవమి, మార్చి 28న హనుమత్సేవ, మార్చి 30న కల్యాణోత్సవం, మార్చి 31న రథోత్సవం, ఏప్రిల్‌ 2న చక్రస్నానం జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు :

తేదీ              ఉదయం రాత్రి

25-03-2018(ఆది)     ధ్వజారోహణం(ఉ||9.03 గం||లకు)  పోతన జయంతి,

                              శేషవాహనం.

26-03-2018(సోమ) వేణుగాన అలంకారం    హంస వాహనం

27-03-2018(మంగళ) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం

28-03-2018(బుధ) నవనీతకృష్ణ అలంకారం            హనుమంత సేవ

29-03-2018(గురు) మోహినీ అలంకారం     గరుడసేవ

30-03-2018(శుక్ర) శివధనుర్భాణ అలంకారం           శ్రీ సీతారాముల కల్యాణం                       (రా|| 8 గం||లకు), గజవాహనం.

31-03-2018(శని) రథోత్సవం —–

01-04-2018(ఆది) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం

02-04-2018(సోమ) చక్రస్నానం   ధ్వజావరోహణం(సా|| 5.30 గం||)

03-04-2018(మంగళ) ——–    పుష్పయాగం(సా|| 5 గం||).

—————————————————————-
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.