TTD GETS THE PAT FROM UNION MINISTRY OF CULTURE COMMITTEE FOR ITS PILGRIM REFORMS_ టిటిడి పాలనపై కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారుల కమిటీ పరిశీలన వివరాలు తెలియజేసిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirupati, 28 Sep. 18: A team of officials representing Union Ministry of Culture Commitee heaped in praises on TTD for its pro pilgrim initiatives.

A high level meeting was held by Tirumala JEO Sri KS Sreenivasa Raju at SPRH in Tirupati on Friday evening with the Ministry of Culture department officials. The JEO explained in detail about the various formats of darshan introduced by TTD for the sake of pilgrims in Tirumala.

He also explained to them about the activities of Anna prasadam, Health, Kalyana katta, Transport, Medical, Vigilance and other wings of TTD.

CVSO Incharge Sri Siva kumar Reddy, FACAO Sri Balaji and heads of various departments, ASI officers Sri Sushantkar, Sri Raman, Sri Satyam, Sri Chaitanya were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి పాలనపై కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారుల కమిటీ పరిశీలన వివరాలు తెలియజేసిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుపతి, 2018, సెప్టెంబరు 28: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానముల పాలనా వ్యవస్థను కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారుల కమిటీ పరిశీలించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఈ మేరకు కమిటీ టిటిడి అధికారులతో సమావేశమైంది. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఈ సందర్భంగా టిటిడి కార్యకలాపాలను వివరించారు.

జెఈఓ మట్లాడుతూ ముందుగా ధర్మకర్తల మండలి, ఈవో, జెఈవోల విధులను వివరించారు. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాదాలు, వైద్యసేవలు, తలనీలాల సమర్పణ, సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం గురించి తెలియజేశారు. లడ్డూ ప్రసాదాల పంపిణీ, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో విమానాశ్రయాల తరహా భద్రతా వ్యవస్థ, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, పారిశుద్ధ్యం, రవాణా, టిటిడి స్థానికాలయాలు, బ్రహ్మోత్సవాలు తదితర ఉత్సవాలు, పర్వదినాల నిర్వహణ, ట్రస్టులు, స్కీమ్‌, శ్రీవారి సేవ తదితర అంశాలను వారికి వివరించారు. అలాగే స్వచ్ఛ తిరుమల, సుందరీకరణ, హిందూ ధర్మప్రచార పరిషత్‌, వివిధ ప్రాజెక్ట్‌ల పనితీరును తెలియజేశారు.

కాగా, టిటిడి ఆలయాల నిర్వహణ చక్కగా ఉందని కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ కార్యదర్శి శ్రీ ప్రణవ్ కుల్లార్, సంచాలకులు శ్రీ హరీష్ కుమార్ అభినందించారు. ఈ కమిటి అధికారులు శనివారం తిరుమల పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఇన్ చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, ఎస్ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డిఎఫ్ఓ శ్రీ ఫణికుమార్ నాయుడు, ఆరోగ్య శాఖాధికారి డా.. శర్మిష్ట, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, ఏఎస్ఐ అధికారులు శ్రీ శ్రీరామన్, సుశాంత్కర్, శ్రీ సత్యం, శ్రీ చైతన్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.