TTD INVITES ONLINE DONATIONS FOR CHILDREN’S SUPER SPECIALITY HOSPITAL _ చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి కోసం విరాళాలు ఆహ్వానం

UDAYASTHAMANA TICKET ASSURED FOR DONATION OF Rs. 1 CRORE AND 1.5 CRORE ONLINE OPENS ON FEB 16

 

Tirumala, 15 February 2022: TTD has decided to open up online donations for promoting donations towards the construction and establishment of exclusive Children’s Super Specialty Hospital at Tirupati which is available from February 16 by 9.30 am onwards in the TTD official portal https://tirupatibalaji.ap.gov.in

The 531 tickets of the reputed Udayasthamana Arjita Seva (USSES) that are available to date will be offered to donors of Rs.1 crore and Rs.1.5cr only.

Those who donate Rs.1.5 crore will be provided USSES on Fridays and Rs 1 crore on the remaining days of the week.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 16న ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విరాళాల స్వీక‌ర‌ణ ప్రారంభం

చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి కోసం విరాళాలు ఆహ్వానం

రూ. కోటి విరాళం ఇస్తే ఒక ఉద‌యాస్త‌మాన సేవా టికెట్ మంజూరు

తిరుమ‌ల‌, 2022 ఫిబ్ర‌వ‌రి 15: తిరుప‌తిలో చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణం కోసం టిటిడి దాత‌ల నుండి విరాళాలు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఫిబ్ర‌వ‌రి 16న బుధ‌వారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విరాళాల స్వీక‌ర‌ణ ప్రారంభం కానుంది. https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దాత‌లు విరాళాలు స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

ప‌లు కార‌ణాల వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు ఖాళీ అయిన 531 ఉద‌యాస్త‌మాన సేవా టికెట్ల‌ను దాత‌ల‌కు అందుబాటులో ఉంచ‌డ‌మైన‌ది. ఇందుకోసం వారంలో శుక్ర‌వారం నాటికైతే రూ.1.50 కోట్లు, మిగిలిన రోజుల్లో అయితే ఒక కోటి రూపాయ‌లను దాత‌లు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ముందు వ‌చ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా పార‌ద‌ర్శ‌కంగా ఈ సేవా టికెట్ల కేటాయింపు జ‌రుగుతుంది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.