TTD IS EVER PREPARED TO BE THE TORCH BEARER OF HINDU DHARMA-TTD CHAIRMAN _ పీఠాధిపతులు, మఠాధిపతుల ఆశీస్సులతో మరింత గొప్పగా ధర్మ ప్రచారం- ⁠ధార్మిక సదస్సులో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

పీఠాధిపతులు, మఠాధిపతుల ఆశీస్సులతో మరింత గొప్పగా ధర్మ ప్రచారం

•⁠ ⁠ధార్మిక సదస్సులో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

ఫిబ్రవరి 03, తిరుమల, 2024: మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా శ్రీ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. భారతదేశం
పవిత్రభూమి అని, ఇక్కడే వేదాలు ఆవిర్భవించాయని, సాక్షాత్తు విష్ణుమూర్తి వారు శ్రీరామ, శ్రీకృష్ణ రూపాల్లో అవతరించారని చెప్పారు. ఈ దేశంలోనే ధర్మాచరణకు దిక్సూచిగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా అవతరించారని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుండి సముచితమైన సూచనలను, సలహాలను స్వీకరిస్తామన్నారు. తాను తొలిసారి ఛైర్మన్ గా ఉన్న సమయంలో రెండు సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాల ద్వారా భగవంతుడిని భక్తుల చెంతకు తీసుకెళ్లామని చెప్పారు. స్వామివారికి సంకీర్తనల సేవ అందించిన శ్రీ అన్నమాచార్యులు, శ్రీ పురందరదాసు, శ్రీ కనకదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేర్లతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని గుర్తు చేశారు. వేద పరిరక్షణ కోసం వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు.

సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తున్న టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందని శ్రీ కరుణాకర రెడ్డి స్వామీజీలకు విన్నవించారు. మీ ఆశీస్సులతో, సలహాలు, సూచనలను శాసనంగా భావించి టీటీడీ ధర్మ ప్రచారానికి పునరంకితం అవుతుందని ఆయన స్వామీజీలకు విన్నవించారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే తగిన సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TTD TRUST BOARD CHIEF SEEKS SUGGESTIONS FROM PONTIFFS TO GLORIFY DHARMIC ACTIVITIES

 

TIRUMALA, 03 FEBRUARY 2024: The world-renowned Hindu religious organisation of Tirumala Tirupati Devasthanams(TTD) has been doing a wide range of Dharmic activities since several decades and is ever prepared to glorify Hindu Dharma as per the suggestions of the Peethadhipathis and Hindu religious heads, asserted TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy.

 

The three-day religious conclave hosted by TTD under the aegis of its Hindu Dharma Prachara Parishad and SV Vedic University commenced with spiritual fervour in Astana Mandapam at Tirumala on Saturday. During his inaugural speech, the TTD Board Chief advocated that Bharat is the land of Vedas and Lord Sri Maha Vishnu emerged in various incarnations during aeon to protect humanity from evil forces. In Kaliyuga, Sri Maha Vishnu took the form of Sri Venkateswara and stepped on the most sacred Tirumala.

 

TTD, from the past several decades, has been involved in carrying out various spiritual, religious and social welfare programme to take forward the ethics and ethos of Hindu Sanatana Dharma taught by the great forefathers and saints in sacred Hindu texts.

 

During his earlier term as TTD Trust Board Chairman, he organised the Dharmika Sadas and incorporated various spiritual programmes like Dalita Govindam, taking the Lord Venkateswara to the door steps of people of backward areas, Matsya Govindam training the fishermen community in priesthood,  Tarigonda Vengamamba Project to take forward the great literature, commenced SVBC to spread the glory of Sri Venkateswara Bhakti Cult through visual medium and also established SVVedic University to sustain vedic education for future generations, with the suggestions offered by various seers during that religious conclave.

 

He said, in spite of the commitment of TTD towards glorifying Hindu Santana Dharma through its wide range of religious activities, some vested interests are often indulged in pointing out the ethos of TTD. “We are proving our stand and commitment in sustaining Hindu Sanatana Dharma through our dharmic activities. I humbly request the most pious Swamijis and Matajis who graced the Sadas to provide their valuable suggestions to take forward our Hindu Sanatana Dharma across the country as well globe”, he maintained.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI