TTD JEO & DISTRICT COLLECTOR INSPECT SSD TOKENS CENTRES _ సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జేఈవో

Tirupati, 31 December 2022:  District Collector Sri K Venkata Ramana Reddy along with JEO (H &E) Smt Sada Bhargavi on Saturday inspected the nine centres set up by TTD in Tirupati specially to issue Slotted Sarva Darshan tokens for Vaikunta Dwara Darshan at Srivari Temple from January 2 to January 11.

They went round queue lines and made suggestions to TTD and district officials to ensure smooth process of issuance of SSD tokens.

District Collector said additional sanitary workers will be deployed by TMC to clear garbage frequently in co-ordination with sanitary workers of TTD,

The JEO said TTD has organised supply of drinking water, tiffin, Annaprasadam, tea, coffee to devotees at each counter.  From 2pm of January 1 onwards SSD tokens in a continuous manner will be issued, till the 10days quota of tokens is completed.

Among others TTD JEO said adequate sanitary staff be deployed at all centres, TTD vigilance in co-ordination with police all set to avoid traffic jams near Ramachandra Pushkarini, Indira Maidan, Srinivasam, Vishnu Nivasam and Govindarajaswami choultries.

District Collector also advised for uninterrupted power supply and installation of LED screens to display availability of tokens with regular updates.

TTD CE Sri Nageswara Rao, SE Sri Venkateshwarlu, VGO Sri Manohar, DyEOs Sri Govindarajan, Sri Subramaniam, DEO Sri Bhaskar Reddy, Additional Health officer Dr Sunil, IT GM Sri Sandeep, EEs Sri Manoharam, Sri Murali and other engineering officials were present.

QR Code facility at Token Centres for devotees’ benefit.

TTD has installed the QR code facility at all the nine SSD tokens issue centres for easy direction identification as well check availability of tokens by devotees. Devotees could easily go from one area to another by updating the QR codes on their mobiles after reaching Tirupati.

The QR code facility was successfully tested during the last Brahmotsavam at Tirumala is now deployed for the Vaikunta Ekadasi as well and devotees advised to utilise the facility for their convenience and comfort.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జేఈవో

తిరుపతి 31 డిసెంబరు 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలను శనివారం జిల్లాకలెక్టర్ శ్రీ వెంకటరమణా రెడ్డి, టీటీడీ జేఈవో శ్రీమతి సదాబార్గవి పరిశీలించారు.

సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, బారికేడ్లను వారు పరిశీలించారు. ఈ కేంద్రాలవద్ద పోగయ్యే చెత్త ఎప్పటికప్పుడు తొలగించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పారిశుధ్య కార్మికులను నియమిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణా రెడ్డి చెప్పారు. టీటీడీ ఆరోగ్యవిభాగం అధికారులు, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ప్రత్యేక విధులకు నియమించిన టీటీడీ అధికారులు మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పని చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మరుగుదొడ్ల నిర్వహణ , తాగునీటి సరఫరా పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రతి కౌంటర్ వద్ద భక్తులకు టిఫిన్, అన్నప్రసాదాలు, టీ,కాఫీ, తాగునీరు నిరంతరంగా సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జేఈవో శ్రీమతి సదా భార్గవి కలెక్టరుకు తెలియజేశారు. జనవరి 1 నుండి టోకెన్ల జారీ ప్రారంభించి కోటా పూర్తి అయ్యేవరకు నిరంతరంగా జారీ చేయడానికి ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, వాటి నిర్వహణకు అవసరమైనంత మంది సిబ్బందిని నియమించామని ఆమె వివరించారు. రామచంద్ర పుష్కరిణి, ఇందిరామైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసుల సహకారంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టీటీడీ అధికారులకు సూచించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు.

నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా, టోకెన్లు ఏ తేదీ ఏ సమయానికి జారీ చేస్తున్నారనే వివరాలు భక్తులకు తెలిసేలా ఏర్పాటు చేసిన ఎల్ఈ డి స్క్రీన్లు సక్రమంగా పని చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు ,విజివో శ్రీ మనోహర్, డిప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్ , శ్రీ సుబ్రహ్మణ్యం, డీఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, ఐటి జిఎం శ్రీ సందీప్, ఈఈ లు శ్రీ మనోహర్, శ్రీ మురళి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

భక్తుల సదుపాయం కోసం అన్ని టోకెన్ల జారీ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ సదుపాయం
తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల్లో భక్తుల సౌకర్యం కోసం క్యూఆర్ కోడ్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు తమ మొబైల్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఎలా వెళ్ళాలో సూచిస్తుంది. బ్రహ్మోత్సవవాల సందర్బంగా తిరుమలలో ఏర్పాటు చేసిన ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో తిరుపతిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఈ సదుపాయం ఉపయోగించుకోవాలని కోరడమైనది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది