TTD JEO FOR EDUCATION AND HEALTH INSPECTS TTD EMPLOYEES QUARTERS _ టిటిడి ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను త‌నిఖీ చేసిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీమ‌తి ఎస్‌.భార్గ‌వి

Tirupati, 6 Oct. 20: The Joint Executive Officer of Education and Health of TTD, Smt Sada Bhargavi on Tuesday inspected the TTD Employees Quarters at KT quarters, Vinayak Nagar, Ramnagar to verify the issues if any.

During her inspection, she along with a team of officials identified that of the 1697 quarters 721 are lying vacant.

She immediately directed officials concerned to set right all the lapses and ensure quality electricity, drinking water  and sanitation, garbage cleaning facilities at all quarters.

TTD Estate Officer Sri Mallikarjun, SE-1 Sri Jagadeswar Reddy, SE(Electrical) Sri Venkateshwarlu, EE-2 Sri Jayaram Nayak, Additional Health officer Dr Sunil Kumar and other officials were present .

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను త‌నిఖీ చేసిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీమ‌తి ఎస్‌.భార్గ‌వి

తిరుప‌తి‌, 2020 అక్టోబ‌రు 06: తిరుప‌తిలోని ప‌లు ప్రాంతాల్లో గ‌ల టిటిడి ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను మంగ‌ళ‌వారం టిటిడి జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీమ‌తి ఎస్‌.భార్గ‌వి త‌నిఖీ చేశారు.
 
కెటి క్వార్టర్స్‌, వినాయ‌క న‌గ‌ర్, రామ్‌నగ‌ర్ ప్రాంతాల్లోని ఉద్యోగుల నివాసాల‌ను ప‌రిశీలించారు. ఈ ప్రాంతాల్లోని 1697 క్వార్ట‌ర్స్‌లో 721 ఖాళీగా ఉన్న‌ట్టు గుర్తించారు. నీటి వ‌స‌తి, విద్యుత్‌, పారిశుద్ధ్యం విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సూచించారు. క్వార్ట‌ర్స్‌లో గ‌ల లోపాల‌ను స‌రిచేసి మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

జెఈవో వెంట టిటిడి ఎస్టేట్ ఆఫీస‌ర్ శ్రీ మ‌ల్లిఖార్జున‌, ఎస్ఇ-1 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఈఈ -2 శ్రీ జ‌య‌రాం నాయ‌క్‌, అద‌న‌పు ఆరోగ్యశాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌కుమార్ ఇత‌ర అధికారులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.