TTD JEO INSPECTS KARTHIKA MAHA DEEPOTSAVAM PLATFORM AT VIZAG _ విశాఖలో కార్తీక మహాదీపోత్సవం వేదికను పరిశీలించిన జెఈఓ శ్రీమతి సదా భార్గవి

Visakhapatnam,14 November 2022: TTD JEO (E&H) Smt Sada Bhargavi on Monday inspected the Karthika Maha Deepotsavam platform at Ramakrishna Beach and made valuable suggestions to enhance the divine ambiance of the celestial event.

Addressing the media later she lauded the officials of all TTD departments including engineering SVBC press relations, Health, Annamacharya Project, Srivari temple, Garden, Srivari Seva, and vigilance for putting up a spectacular platform for the divine and celestial fete,

Highlighting the schedule the JEO said programs commence with Yati Vandana by 5.30 pm and conclude with Harati by 8.30 pm.

Among others, an address by TTD board Chairman Sri YV Subba Reddy and a blessing address by Pontiff of Vishakha Sharada Peetham Sri Sri Sri Swaroopananda Saraswati Swamiji, classical music and dance events will be there, she said.

She appealed to devotees to participate in traditional dress and beget blessings of Sri Venkateswara and that the entire program will be live telecast by the SVBC channel.

TTD CVSO Sri Narasimha Kishore said in coordination with local police security arrangements are being made for benefit of devotees along with the support of 1000 Srivari Sevaks.TTD has also organized a public address system and LED screens for the convenience of devotees.

SRIVARI SHANKU AND CHAKRA ICONS IN SAIKAT ART

The highlight of the event is the sand art creations of Shanku and Chakra ( icons of lord Venkateswara) by the students of Andhra university.

SVBC CEO Sri Shanmugha Kumar, donors Sri Rajesh, Sri Himanshu Prasad, Sri Krishna Prasad, TTD SE-2 Sri Jagadiswar Reddy, PRO Dr. T Ravi, DE Sri Ravi Shankar Reddy, DFO Sri Srinivas, VGO Sri Manohar, and others were present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

విశాఖలో కార్తీక మహాదీపోత్సవం వేదికను పరిశీలించిన జెఈఓ శ్రీమతి సదా భార్గవి

విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ వద్ద కార్తీక మహాదీపోత్సవం వేదికను టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి సోమవారం ఉదయం పరిశీలించారు.

విశాఖపట్నం, 2022 న‌వంబ‌రు 14 ; ఈ సందర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ టిటిడిలోని ఇంజినీరింగ్, ఎస్వీబీసీ, ప్రజా సంబంధాలు, శ్రీవారి సేవ, నిఘా మరియు భద్రత, ఉద్యానవన, ఆరోగ్య, అన్నమాచార్య ప్రాజెక్టు, ఆలయం తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసే శోభాయమానంగా వేదికను ఏర్పాటు చేశారని చెప్పారు.

సాయంత్రం 5.30 గంటలకు యతివందనంతో కార్యక్రమం మొదలవుతుందని, రాత్రి 8.30 గంటలకు ముగుస్తుందని తెలియజేశారు. ఇందులో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి సందేశం, విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం, సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపారు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ స్థానిక పోలీసుల సహకారంతో దీపోత్సవానికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తులకు సేవలందించేందుకు 1000 మంది శ్రీవారి సేవకులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా సౌండ్ సిస్టం, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని వివరించారు.

ప్రత్యేక ఆకర్షణగా సైకత శ్రీవారి శంఖుచక్రాలు

వేదిక వద్ద శ్రీ జగదీష్ ఆధ్వర్యంలోని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఇసుకతో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి శంకు చక్ర నామాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

జెఈఓ వెంట ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, దాతలు శ్రీ రాజేష్, శ్రీ హిమాంశుప్రసాద్, శ్రీ కృష్ణప్రసాద్, టిటిడి ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, పిఆర్ఓ డా.టి.రవి, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, విజివో శ్రీ మనోహర్ తదితరులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.