TTD LIMITS SRIVANI QUOTA TO 1000 A DAY _ శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసిన టిటిడి 

750 IN ONLINE 250 OFFLINE

 

DISPENSES SRIVANI SERVICES IN MADHAVAM  REST HOUSE

 

TIRUPPAVADA TO RESUME FROM JAN 12

 

TIRUMALA, 10 JANUARY 2023:  Keeping in view the darshan priority of common people, TTD has limited the total number of SRIVANI tickets to 1,000 tickets per day.

 

Out of 1,000 tickets, 750 to be made available online while 250 tickets be made available in the current booking counter at the Airport. Already TTD has released 500 tickets online and the additional 250 will be released on January 11.

 

TTD has dispensed with the SRIVANI ticket issuing services in Madhavam Rest House. Henceforth the offline tickets will be issued only in the Tirupati Airport Counter to the SRIVANI donors on production of their Boarding Pass.

 

The SRIVANI donors have to attach the Boarding pass to the Break darshan ticket. PNR number with Airline reference should also be entered in the ticket.

 

The staff members at VQC-I will verify the break darshan ticket along with the Boarding Pass and allow the genuine pilgrim alone for darshan of Sri Venkateswara.

 

TIRUPPAVADA SEVA TO RESUME

 

The Tiruppavada Arjita Seva is set to resume from January 12 onwards in Tirumala temple. The pilgrims have to register in CRO counter in Tirumala and through electronic dip 25 tickets will be issued to on January 11 at 5pm.

 

The devotees are requested to make note of the above details.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 
 

శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసిన టిటిడి

– ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌లైన్ లో 250

– మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ నిలిపివేత

– జనవరి 12 నుంచి శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవ పునఃప్రారంభం

తిరుమల, 2023 జ‌న‌వ‌రి 10: శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టిటిడి రోజుకు 1,000కి పరిమితం చేసింది.

ఇందులో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్ లైన్ లో 250 టికెట్లను జారీ చేస్తారు. ఇప్పటికే టిటిడి 500 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, అదనంగా జనవరి 11న మరో 250 టికెట్లు
విడుదల చేయనుంది.

మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టిటిడి రద్దు చేసింది. ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు.

శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్‌కి బోర్డింగ్ పాస్‌ను జతచేయాలి. టికెట్ పై ఎయిర్‌లైన్ రిఫరెన్స్‌తో కూడిన పిఏన్ అర్ నంబర్‌ను కూడా నమోదు చేయించాలి.

వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సిబ్బంది బ్రేక్ దర్శన టిక్కెట్‌తో పాటు బోర్డింగ్ పాసును తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారు.

తిరుప్పావడ సేవ పునఃప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ జనవరి 12 నుంచి పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం యాత్రికులు తిరుమలలోని సిఆర్‌ఓ కౌంటర్‌లో నమోదు చేసుకోవాలి. వీరికి జనవరి 11న సాయంత్రం 5 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 25 టికెట్లు జారీ చేస్తారు.

భక్తులు పై అంశాలను గమనించవలసిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.