TTD MODEL PROJECT ON GOSHALA MAINTENANCE _ గోశాలల నిర్వ‌హ‌ణ‌కు మోడ‌ల్ ప్రాజెక్టు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirumala, 26 February 2022: TTD EO Dr KS Jawahar Reddy said that TTD in collaboration with ISCON would soon set up a model project in 15 locations across AP for training operators on the maintenance of SV Goshala, making it as a role model.

 

Addressing a review meeting on Goshala maintenance at Sri Padmavati Rest House on Saturday the TTD EO emphasised the need for training the operators for several Goshalas in remote areas of the state. 

 

The TTD EO said a committee should be set up with ISKCON to speed up the training program and as a pilot project, ISKCON should enthuse other Goshala Operators by training anyone Goshala operator as a model. He said the Goshala operators need training on organic farming, and the production of Go-based goods and Panchagavya products also.

 

Among others, he asked the Director of SV Goshala to establish a link with other Goshalas in state and directed SVBC to telecast a program on the significance of Goshalas etc.

 

Thereafter the TTD EO also reviewed the design of Matrusri Tarigonda Vengamamba development project, Karnataka choultry development works etc.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, FA&CAO Sri Balaji, CE Sri Nageswara Rao, SE-2 Sri Jagadeeshwar Reddy, Estates Officer Sri Mallikarjuna, SV Goshala Director Dr Harnath Reddy, SV Ayurveda College Principal Dr Murali Krishna were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

గోశాలల నిర్వ‌హ‌ణ‌కు మోడ‌ల్ ప్రాజెక్టు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 26: రాష్ట్రంలోని ఎంపిక చేసిన‌ గోశాల‌ల్లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీపై ఇస్కాన్ సంస్థ స‌హ‌కారంతో శిక్ష‌ణ ఇవ్వాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో శ‌నివారం గోసంర‌క్ష‌ణ కార్య‌క‌లాపాల‌పై ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో గోశాల‌లు ఉన్నాయ‌ని, వాటిని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించేందుకు శిక్ష‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అన్నారు. ఇందుకోసం ఇస్కాన్ సంస్థ ముందుకొచ్చింద‌ని, గోశాల‌ల నిర్వ‌హ‌ణ‌, శిక్ష‌ణ‌పై మోడ‌ల్ ప్రాజెక్టుగా ఒక గోశాల‌ను రూపొందించాల‌ని కోరారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ, గో ఆధారిత ఉత్ప‌త్తుల త‌యారీతోపాటు గోవు విశిష్ట‌త‌ను గోశాల నిర్వాహ‌కుల‌కు తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇందుకోసం ఇస్కాన్ సంస్థ‌, గోశాల నిర్వాహ‌కుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటుచేసి టిటిడి భాగ‌స్వామ్యంతో ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. ప్ర‌తి 15 రోజుల‌కోసారి ఎస్వీబీసీలో గో ఆధారిత వ్య‌వ‌సాయం, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ, గోసంర‌క్ష‌ణ‌పై ఒక కార్య‌క్ర‌మం ప్ర‌సారం చేయాల‌ని కోరారు.

అనంత‌రం తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నం డిజైన్ల‌పై ఈవో అధికారుల‌తో చ‌ర్చించారు. ధ్యాన‌మందిరం, చుట్టుప‌క్క‌ల ప్ర‌హ‌రీ, పూల‌తోట‌లు, బృందావ‌నం చుట్టూ వెంగ‌మాంబ ర‌చ‌న‌లను భ‌క్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. అదేవిధంగా, క‌ర్ణాట‌క సత్రాల ప్రాంతంలో యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం, క‌ల్యాణ‌మండ‌పం త‌దిత‌ర నిర్మాణ ప‌నుల‌ను స‌మీక్షించి వేగ‌వంతం చేయాల‌ని సూచించారు.

ఈ స‌మీక్ష‌లో జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ మ‌ల్లికార్జున‌, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డా.హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ఆయుర్వేద క‌శాళాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.