TTD MULLS DEVELOPMENT OF ANJANADRI TIRUMALA _ తిరుమలలో అంజనాద్రి అభివృద్ధికి శ్రీకారం : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

Tirupati, 20 Jan. 22: TTD EO Dr KS Jawahar Reddy has instructed the officials concerned to come up with a concrete action plan on the development of Anjanadri Tirumala before February 15.

 

A review meeting on various subjects was held in Sri Padmavathi Rest House at Tirupati on Thursday wherein Additional EO Sri AV Dharma Reddy and Tirupati JEO Sri Veerabrahmam also participated. 

 

Earlier, TTD CE Sri Nageswara Rao presented a PPP on the outlay of Anjanadri Hills, Hanuman Birthplace etc. The EO instructed the Engineering officials to come out walkthrough plan on Anjanadri.

 

It may be mentioned here that TTD has declared Anjanadri near Akasa Ganga area located as the Birth place of Sri Anjaneya Swamy, with strong evidence from Puranas, Sastras, and Epigraphies by a team of scholars.

 

Earlier review meetings were also held separately on Sri Padmavathi Paediatric Cardiac Hospital in Tirupati and Tarigonda Vengamamba Dhyana Mandiram at Tirumala.

 

The EO directed the officials concerned to come out with an action plan on the Vengamamba Dhyana Mandiram before February 7 after thoroughly visiting the site.

 

Art Director Sri Ananda Sai, Former Board Member Sri Muralikrishna were present.

 

The EO instructed the officials to submit a Detailed Project Report (DPR) on February 15 about the works with respect to Paediatric Cardiac Hospital.

 

FACAO Sri Balaji, Chief Audit Officer and CS RMO Sri Sesha Sailendra, Director of Paediatric Hospital Dr Srinath Reddy were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

తిరుమలలో అంజనాద్రి అభివృద్ధికి శ్రీకారం : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

తిరుపతి, 2022 జ‌న‌వ‌రి 20: తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం వివిధ అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.

ముందుగా అంజనాద్రి కొండలు, హనుమాన్ జన్మస్థలం తదితర వాటిపై చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అంజనాద్రిపై క్షేత్రస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులను ఈఓ ఆదేశించారు.

పురాణాలు, శాస్త్రాలు, శాసనాలను పరిశీలించి పండితుల బృందం బలమైన ఆధారాలతో ఆకాశ గంగ సమీపంలో ఉన్న అంజనాద్రిని శ్రీ ఆంజనేయ స్వామి జన్మస్థలంగా ప్రకటించడాన్ని ఇక్కడ పొందుపరచాలన్నారు.

అంతకుముందు తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, తిరుమలలో నిర్మించనున్న తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరంపై వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. వెంగమాంబ ధ్యాన మందిరం స్థలాన్ని పూర్తిస్థాయిలో పర్యటించి ఫిబ్రవరి 7వ తేదీలోపు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎస్ఈ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, సంస్కృత పండితుడు శ్రీ రాణి సదాశివమూర్తి, ఆర్ట్ డైరెక్టర్ శ్రీ ఆనంద సాయి, మాజీ బోర్డు సభ్యుడు శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించిన పనులపై ఫిబ్రవరి 15న సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించాలని అధికారులను ఈఓ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎఫ్ఎ అండ్ సిఎఓ శ్రీ బాలాజీ, చీఫ్ ఆడిట్ ఆఫీసర్, సిఎస్ ఆర్ఎంవో శ్రీ శేష శైలేంద్ర, చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.