TTD MULLS KARTHIKA MASA VISHNU PUJAS IN TIRUMALA _ నవంబరులో వసంత మండపంలో కార్తీక మాస విష్ణుపూజలు
TIRUMALA, 29 OCTOBER 2022: In connection with the advent of the auspicious Karthika Masam, TTD is all set to observe Karthika Masa Vishnu Pujas at Vasanta Mandapam in Tirumala as in the case of last year.
Sri Maha Vishnu Pujas in the holy Karthika Masam will be conducted as per Vaikhanasa Agama Sastra. The Vishnu Pujas includes Sri Vishnu Salagrama Puja between 3 PM to 4:30 PM on November 4, Kaisika Dwadasi Tulasi-Damodara Puja on November 5 between 3 PM to 4:30 PM, Gopuja between 8:30 AM and 10 AM on November 11 and Dhanvantari Jayanti between 10AM and 11AM on November 21.
The SVBC will telecast these religious events live for the sake of global devotees.
నవంబరులో వసంత మండపంలో కార్తీక మాస విష్ణుపూజలు
తిరుమల, 2022 అక్టోబరు 29: లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో నవంబరు 4 నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల్లో తిరుమల వసంత మండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన పూజలు వైఖానసాగమబద్ధంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
నవంబరు 4న శుక్రవారం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు విష్ణుసాలగ్రామ పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా, నవంబరు 5న మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు కైశికద్వాదశి – శ్రీ తులసీ దామోదర పూజ, నవంబరు 10న ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు గోపూజ, నవంబరు 21న ఉదయం 10 నుండి 11 గంటల వరకు ధన్వంతరి జయంతి నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.